Tuesday, April 25, 2017

India in struggle

ఓయూలో విద్యార్థి చ‌ల‌నాలు - సి. కాశీం


తెలంగాణ లాంటి ప్రాంతంలో ఒక విద్యా సంస్థ ఏర్పడటం ఆనాటికి అపురూపమే. ఫ్యూడల్‌ ప్రభువుల పాలనలో ఉన్న తెలంగాణ ఆర్థిక దోపిడీికి, రాజకీయ అణచివేతకు, సాంస్కృతిక వివక్షకు గురయింది. విద్య పట్ల, ప్రజల సాంస్కృతిక వికాసం పట్ల శ్రద్ధలేని పాలన అది. ప్రభువుల విలాసాలు, ప్రజల విలాపాలు. కనీసం ఫ్యూడల్‌ ప్రభువుల పిల్లలనైనా చదువుల వైపు ముఖ్యంగా ఆంగ్ల విద్య వైపు మళ్లించారా? అంటే అదీ లేదు. ʹచదివి ఏం చేయాలి? మరొకరి కింద
ఉద్యోగమే కదా! ఒకరి కింద పని చేయాల్సిన ఖర్మ మనకేమి పట్టింది. మనకిందే వందలమంది జీతగాళ్లు, పనిమనుషులు ఉంటారుʹ అనే లాలసత్వం ప్రభువర్గాలలో ఉండింది. అందుకే వాళ్లు కూడా చదువుల వైపు మళ్లలేదు. కనీసం వీళ్లైనా ఆధునిక ఆంగ్ల విద్యను అభ్యసించి ఉంటే ఆ విద్య ఇచ్చిన చైతన్యంతో జాతీయోద్యమం వలె తెలంగాణలో ఫ్యూడల్‌ వ్యతిరేక ఉద్యమం కొంత ముందే ప్రారంభమయ్యేది. ఆ నష్టం తెలంగాణ సమాజానికి జరిగింది. ఫ్యూడల్‌ ప్రభువుల, ధనికుల పిల్లల చదువులు కూడా ఎక్కాల పుస్తకాలు, పెద్ద బాలశిక్ష చదవటం వరకే పరిమితమయ్యాయి.
అందుకే హైదరాబాద్‌ సంస్థానం విద్యలో చాలా వెనకబడి ఉంది. జనాభాలో నూటికి ముగ్గురు లేదా నలుగురు విద్యావంతులు మాత్రమే ఉన్నారు. పద్నాలుగు శాతం మాత్రమే ఉర్దూ మాట్లాడే ప్రజలున్న ప్రాంతంలో 86 శాతం తెలుగు ఇతర భాషలు మాట్లాడే వారిని కాదని ఉర్దూ అధికార భాష అయింది. ఈ పరిస్థితులలోనే ఉస్మానియా విశ్వవిద్యాలయం ఏర్పడింది(1917 ఏప్రిల్‌ 26 ఫర్‌మాన్‌).
ఒక విద్యా కేంద్రం ఏర్పడటం వలన వివిధ ప్రాంతాలలోని విద్యార్థులు ఒక దగ్గర కూడుకొనే అవకాశం ఏర్పడింది. బ్రిటిష్‌వాళ్లు భారతదేశంలో విశ్వవిద్యాలయాలు నెలకొల్పడంతో(1857 నుంచి) దేశ వ్యాపితంగా ఉన్న ధనవంతుల పిల్లలు ఒకే దగ్గర చేరి చదువుకుంటున్న సందర్భంలో జాతీయ భావాలు ఏర్పడి బ్రిటిష్‌ వ్యతిరేక పోరాటాన్ని నడిపినట్లే, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చదువుకోవడానికి వచ్చిన ధనవంతుల పిల్లలు నిజాం వ్యతిరేక పోరాటానికి నాంది పలికారు. ఎప్పుడైనా విద్యార్థులు ఒక సమూహంగా ఏర్పడి పోరాడటానికి విద్యాలయాలు ప్రధాన పాత్రను పోషిస్తాయి.
ఉస్మానియా విశ్వవిద్యాలయం కూడా అదే పాత్రను నిర్వహించింది. ఆధునిక భావాలు పురుడు పోసుకొని పోరాడే చైతన్యాన్ని విద్య మాత్రమే అందించగలిగింది. సామాజిక మార్పులో విద్య ఆయుధంలా పని చేస్తుందని చెప్పటానికి ఎన్నో సందర్భాలను ఉటంకించవచ్చును. అయితే నిర్ధిష్టంగా తెలంగాణ సమాజంలోనైతే జాతీయ భావాలు అందుకొని నిజాం వ్యతిరేక పోరాటాన్ని యువత చేపట్టటానికి ఉస్మానియా విశ్వవిద్యాలయం అక్కడి విద్యా చైతన్యం పనిచేసింది.
ఓయూలో విద్యార్థి చలనం మూడు స్రవంతులలో జరిగింది. ఒకటి స్వామి రామానంద తీర్థ-ఆర్య సమాజికులు, రెండు ఆలంఖుంద్‌ మీరి నాయకత్వంలోని కామ్రేడ్స్‌ అసోసియేషన్‌-మూడు జాతీయ భావాలు కల్గిన వందేమాతరం ఉద్యమకారులు. వీరందరు సారాంశంలో నిజాం వ్యతిరేక పోరాటాన్ని బలపర్చేవారు. సూక్ష్మంగా చూసినప్పుడు 1925లో ఏర్పడిన ఆర్‌ఎస్‌ఎస్‌కు భావ సారూప్యత కలిగిన ఆర్య సమాజికులు అదే సంవత్సరంలో ఏర్పడిన కమ్యూనిస్టు పార్టీ(సిపిఐ) భావజాలం కలిగిన కామ్రేడ్స్‌ అసోసియేషన్‌. భారత జాతీయ కాంగ్రెస్‌కు దగ్గరగా ఉండే వందేమాతరం వాదులుగా చెప్పవచ్చు.
1930ల తర్వాత జాతీయోద్యమం పతాకస్థాయి నందుకొన్నది. భగత్‌సింగ్‌ అమరత్వం దేశ యువతను మేల్కొల్పింది. విద్యార్థి ఉద్యమాల నిర్మాణానికి మూలమైంది. 1936లో ఏర్పడిన ఏఐఎస్‌ఎఫ్‌ అనే విద్యార్థి సంఘం ఈ నేపథ్యాన్ని కల్గివుంది. సామ్యవాదం, లౌకికవాదం, ఫాసిజం వ్యతిరేకత, స్వాతంత్య్రం ఈ సంస్థ తన లక్ష్యాలుగా ప్రకటించు కున్నది. ఏఐఎస్‌ఎఫ్‌, సీపీఐ ఆలోచనాధారకు దగ్గరగా ఉండేది. హైదరాబాద్‌ సంస్థానంలో ఉండే విద్యార్థులు కూడా ఏఐఎస్‌ఎఫ్‌ సానుభూతిపరులు చాలామందే ఉండేవాళ్లు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో వీరి సంఖ్య గణనీయంగా ఉండేది. కాని సీపీఐ మీద నిజాం సంస్థానంలో నిషేధం ఉండింది. అందువలన ఇక్కడి విద్యార్థులు, యువత ఏఐఎస్‌ఎఫ్‌లో చేరి పనిచేయటం కష్టం. అందుకే ఆలం ఖుంద్‌ మీరి, మగ్దూం మొహియుద్దీన్‌, రాజ్‌ బహదూర్‌ గౌడ్‌, జవాద్‌ హుస్సేన్‌ మొదలైన వాళ్లు కలిసి ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా కామ్రేడ్స్‌ అసోసియేషన్‌ను ఏర్పాటు చేసారు(1938 చివర్లో). సామ్రాజ్యవాద ఫాసిస్టు వ్యతిరేకత, సామ్యవాదం, లౌకికవాద పరిరక్షణ ఈ సంస్థ తన ఆశయాలుగా ప్రకటించుకున్నది.
నిజాంకు వ్యతిరేకంగా ఓయూ కేంద్రంగా విద్యార్థులు ఎ, బి హాస్టల్స్‌లో సమావేశాలు నిర్వహించారు. వీరిపై జాతీయోద్యమ చైతన్యం, గదర్‌ వీరుల త్యాగం ప్రభావం వేసింది. నిజాంకు వ్యతిరేకంగా సంఘటితంగా పోరాడాలని విద్యార్థులు నిర్ణయించుకున్నారు. ఇదే కాలంలో ఓయూలో విద్యార్థులు తప్పకుండా షేర్వాణి ధరించాలని, సూర్యచంద్రులు ఉన్నంతవరకు
ʹనిజాం వర్ధిల్లుగాకʹ, ʹలాంగ్‌ లివ్‌ ది కింగ్‌ʹ అని కీర్తించాలని ప్రభుత్వం హుకుం జారీ చేసింది. ఈ నిర్బంధాన్ని ప్రతిఘటిస్తూ ఓయూలో విద్యార్థులు తమ నిరసనను తెల్పారు. అంతేకాకుండా ప్రత్యామ్నాయంగా వందేమాతర గీతాన్ని పాడటం మొదలుపెట్టారు. వందేమాతం ఆనాటి తరానికి నినాదమైంది. 1938లోనే స్టేట్‌ కాంగ్రెస్‌ ʹసత్యాగ్రహంʹ ఉద్యమం విద్యార్థులకు మరింత నూతన ఉత్తేజాన్ని ఇచ్చింది. వందేమాతరాన్ని నిషేధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అంతటితో ఆగకుండా వందేమాతరం అని నినదించిన విద్యార్థులను సుమారు 1200 మందిని విద్యాలయాల నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు (ది సివిల్‌ అండ్‌ మిలటరీ గెజిట్‌ జూలై 2,1939). ఓయూలో జరుగుతున్న విద్యార్తి ఉద్యమానికి సంఘీభావం తెల్పుతూ నాగపూర్‌ యూనివర్సిటీ విద్యార్థులు ʹది స్టూడెంట్‌ మార్చ్‌ʹ పత్రికను ప్రచురించారు. ఆల్‌ హైదరాబాద్‌ స్టూడెంట్స్‌ యూనియన్‌(1939), రాడికల్‌ స్టూడెంట్స్‌ లీగ్‌ (1939) అనే మరో రెండు విద్యార్థి సంఘాలు కూడా ఈ కాలంలో ఏర్పడి పనిచేసాయి. హైదరాబాద్‌ స్టూడెంట్స్‌ యూనియన్‌ మొదటి సమావేశం రెడ్డి హాస్టల్‌లో జరిగింది. ఓయూలో జరిగిన ఎన్నికలలో ఈ సంస్థ విజయం సాధించింది. అలీఖాన్‌ అధ్యక్షుడిగా ఎన్నికైనాడు.
ఓయూలో ఈ విద్యార్థి చలనాలు ఒకవైపు జాతీయోద్యమానికి మద్దతునిస్తూనే నిజాం వ్యతిరేక పోరాటంలో భాగమయ్యాయి. క్విట్‌ ఇండియా ఉద్యమం, దొడ్డి కొమరయ్య అమరత్వం వీరిలో మరింత చైతన్యాన్ని పెంచింది. తెలంగాణ ప్రాంతంలో చదువుకొనే వీళ్లు అనివార్యంగా నిజాంకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న సాయుధ పోరాటానికి మద్దతుగా అజ్ఞాతంలోకి వెళ్లారు. ప్రజల విముక్తిలోనే తమ విముక్తిని చూసుకున్నారు. నిజాం వ్యతిరేక రైతాంగ సాయుధ పోరాటం విరమణ తర్వాత 1953లో ఆల్‌ హైదరాబాద్‌ స్టూడెంట్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో ʹʹనాన్‌ ముల్కీ గో బ్యాక్‌ʹʹ ఉద్యమం నడిచింది. ఆంధ్ర ప్రదేశ్‌ ఏర్పాటు(1956)కు ముందు నుంచే ఓయు విద్యార్థులు విశాలాంధ్రను వ్యతిరేకిస్తూ ఉద్యమాన్ని నడిపారు. విశాలాంధ్రను వ్యతిరేకించినందుకు ఏడుగురు విద్యార్థులను పోలీసుల తుపాకి తూటాలకు బలిచ్చారు. ఆంధ్రప్రదేశ్‌ ఏర్పాటు ఒప్పందాల ఉల్లంఘనల ఫలితంగా
పదేళ్లు గడిచేసరికి ఓయు కేంద్రంగా అధ్యాపకులు, విద్యార్థులు 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో భాగమయ్యారు. ఆర్ట్స్‌ కాలేజీ వెనుక ఉండే జామై ఉస్మానియా రైల్వేస్టేషన్‌ను తగలబెట్టి మిలిటెంట్‌ ఉద్యమానికి నాంది పలికారు. లావా వలె ఎగజిమ్మిన ఉద్యమం అణచివేతకు గురై ఆగిపోయింది.
నక్సల్బరీ ఒక ఊరు కాదు. నామవాచకం కాదు. సర్వనామం. ఒకరి మీద కాదు దేశ ప్రజలందరి మీద ప్రభావం వేసింది. ముఖ్యంగా విద్యార్థి యువతరం మీద నక్సల్బరీ ప్రభావం ఎక్కువగా ఉంది. కలకత్తా, లక్నో, పంజాబ్‌ యూనివర్సిటీల విద్యార్థుల వలె ఓయు విద్యార్థులు నక్సల్బరీ రాజకీయ ప్రభావానికి గురయ్యారు. ʹడెమోక్రటిక్‌ స్టూడెంట్స్‌ʹ పేరు మీద జార్జిరెడ్డి మిత్రబృందం ఓయూలో పనిచేసింది. విద్యాలయాలలో మతోన్మాదాన్ని, గుండాగిరిని ప్రతిఘటిస్తూ ప్రజాస్వామిక భావాల వ్యాప్తి కోసం ఈ బృందం ఓయూలో పనిచేసింది. ప్రజాస్వామిక భావాలను జీర్ణించుకోలేని మతోన్మాదులు జార్జిరెడ్డిని హత్యచేసారు. ఆ తర్వాత దేశంలో ఎమర్జెన్సీ ఒకదాని తర్వాత ఒకటి చోటుచేసుకున్నాయి. ఎమర్జెన్సీలో ఎందరో విద్యార్థి నాయకులు బూటకపు ఎన్‌కౌంటర్‌లకు గురయ్యారు. ఎమర్జెన్సీకి ఏడాది ముందు(1974) రాడికల్‌ విద్యార్థి సంఘం(ఆర్‌ఎస్‌యు) ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం(పిడిఎస్‌యు) ఆవిర్భవించాయి. ఈ రెండు విద్యార్థి సంఘాలు ఓయూ కేంద్రంగా పనిచేసాయి. సైన్స్‌ కాలేజీ, ఆర్ట్స్‌ కాలేజీ విద్యార్థి సంఘం ఎన్నికలలో ఆర్‌ఎస్‌యు, పిడిఎస్‌యు అధ్యక్ష స్థానాలను కూడా గెలుపొందాయి. ఈ రెండు సంఘాలు విద్యార్థి ఉద్యమ చరిత్రలో మౌలిక మార్పును తీసుకొచ్చాయి. విద్యా రంగ సమస్యల కోసం మిలిటెంట్‌ పోరాటాలను నిర్మాణం చేసి పరిష్కరించాయి. స్కాలర్‌షిప్‌ పెంపు కోసం, విద్యాలయాలలో మౌలిక వసతుల కల్పన కోసం ప్రభుత్వాల మీద ఈ విద్యార్థి సంఘాలు పెట్టిన ఒత్తిడి ఫలితంగా ఎన్నో మార్పులు వచ్చాయి. కేవలం విద్యార్థి కేంద్రంగా పోరాటాలు చేయటం కాకుండా రైతాంగ, కార్మికుల, ప్రజల సమస్యల మీద పోరాటాలు నిర్మాణం చేసారు.
తొంభైయో దశకంలో వచ్చిన దళిత ఉద్యమ ప్రభావంతో ఓయూలో కొందరు విద్యార్థులు అంబేద్కర్‌ ఆలోచన విధానంలో విద్యార్థి కార్యక్రమాలను మొదలుపెట్టారు. ముఖ్యంగా ఎస్సీ రిజర్వేషన్‌ వర్గీకరణ కోసం ʹదండోరాʹ ఉద్యమం మొదలయ్యాక మాదిగ విద్యార్తి సమాఖ్య(ఎంఎస్‌ఎఫ్‌) ఏర్పడింది. ఎస్సీ, ఎస్టీ విద్యార్థి సంఘం, దళిత్‌ స్టూడెంట్స్‌ యూనియన్‌ బిఎస్పీ అవగాహనతో బహుజన స్టూడెంట్స్‌ ఫెడరేషన్‌(బీఎస్‌ఎఫ్‌) ఏర్పడి పనిచేసాయి. మతోన్మాదాన్ని ఎదుర్కొంటూ అంబేద్కర్‌ భావజాలాన్ని ప్రచారం చేసే కార్యక్రమాలను ఈ సంస్థలు తీసుకున్నాయి.
1996లో భువనగిరి, సూర్యాపేట సభ, వరంగల్‌ డిక్లరేషన్‌(1997) తర్వాత తెలంగాణ జనసభ ఏర్పడింది. జనసభ అవగాహనతో తెలంగాణ స్టూడెంట్స్‌ ఫ్రంట్‌(టీిఎస్‌ఎఫ్‌) ఏర్పడి తెలంగాణ కోసం కార్యాచరణను రూపొందించుకున్నది. మలిదశ తెలంగాణ ఉద్యమం ఇట్లా మొదలైంది. వ్యక్తులు, సంస్థలు, సమూహాలు చేసిన కృషి ఫలితంగా మలిదశ తెలంగాణ ఉద్యమం జనసభ, తెలంగాణ స్టూడెంట్స్‌ ఫ్రంట్‌ రూపంలో వ్యక్తమయ్యాయి. టీఎస్‌ఎఫ్‌ ఏర్పాటుకు కేంద్రం ఉస్మానియా విశ్వవిద్యాలయం. కార్యక్షేత్రం కూడా ఓయూనే. తెలంగాణ మీద విద్యార్థులకు అవగాహన కల్పించడం కోసం టీఎస్‌ఎఫ్‌ ఓయూలో అనేక సభలు నిర్వహించింది. పోరాట కార్యక్రమాలు తీసుకున్నది. ʹస్థానికులకే సీట్లు, ఉద్యోగాలుʹ అనే నినాదంతో పనిచేసింది. ఇవాళ అందరూ మాట్లాడుతున్న ప్రజాస్వామిక తెలంగాణ నినాదాన్ని 1998లోనే జనసభ, టీఎస్‌ఎఫ్‌ ఇచ్చాయి. ఒకరకంగా ఓయూలో 2009 విద్యార్థి ఉద్యమం మొదలు కావటానికి టీఎస్‌ఎఫ్‌ పూర్వ నేపథ్యాన్ని రూపొందించింది.
ఓయూ కేంద్రంగా 2009 నవంబర్‌ 29న ఏర్పడిన విద్యార్థి జాక్‌కు ఆర్ట్స్‌కాలేజీ జీవం పోసింది. ఆర్ట్స్‌ కాలేజీ ముందు వెలసిన టెంట్‌ తెలంగాణ ఉద్యమాన్ని శాసించింది. తెలంగాణ ప్రజలందరు ఓయు వైపు చూసారు. చరిత్రలో కని విని ఎరుగని రీతిలో 2010 జనవరిలో 5 లక్షల మంది విద్యార్థులతో ఆర్ట్స్‌ కాలేజీ ముందు స్టూడెంట్‌ జాక్‌ సభ నిర్వహించింది. ఎన్నో మిలిటెంట్‌ కార్యక్రమాలను రూపొందించి ఆరిపోతున్న తెలంగాణ ఉద్యమాన్ని ఓయూ విద్యార్థులు నిలబెట్టారు. 2014 జూన్‌ 2న

No comments:

Post a Comment