Saturday, July 28, 2018

India - Martyrs' week 28 july - 2 august starts



రేపటి ఈ దేశ విముక్తి కోసం తమ ప్రాణాలను ధారబోసిన అమరులను సంస్మరించుకుంటూ రేపటి(జూలై 28) నుండి ఆగస్టు 3వ తేదీ వరకు అమరుల సంస్మరణ వారాన్ని ఈ దేశ పీడిత ప్రజానీకం నిర్వహించుకుంటోంది. సీపీఐ మావోయిస్టు పార్టీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ఈ వారం రోజులపాటు బహిరంగ సభలు, సమావేశాలు జరుగుతాయి. భారత విప్లవ వేగుచుక్క చారుమజుందార్ అమరుడైన జూలై 28 వ తేదీ నుండి ఆగస్టు3 వ తేదీ వరకు అమరవీరుల సంస్మరణ వారాన్ని జరపాలని మావోయిస్టు పార్టీ ఈ మేరకు పిలుపునిచ్చింది. ఈ మేరకు తెలంగాణ లోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, పెద్దపల్లి, ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి , విశాఖపట్నం, విజయనగరం, ఒరిస్సాలోని మల్కన్ గిరి, కోరాపుట్, రాయగడ, గజపతి జిల్లాల్లో మహారాష్ట్ర లోని గడ్చిరోలి, చత్తీస్ గడ్ లోని, బస్తర్, భీజాపూర్, దంతెవాడ, సుక్మా, నారాయణపూర్, కాంకేర్ జిల్లాలలో, బీహార్, జార్ఖండ్ లలో మవోయిస్టు పోస్టర్లు, కరపత్రాలు గోడలకు అంటించింది. అనేక చోట్ల బ్యానర్లను కట్టారు. ʹʹనరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చినప్పటినుండి దేశాన్ని హిందూ మత రాజ్యంగా మార్చడానికి, ప్రజలను మత ప్రాతిపదికన చీల్చడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నది. హిందూ ఫాసిస్టు పాలనను కొనసాగిస్తూ దేస సార్వభౌమాధికారాన్ని సామ్రాజ్యవాదానికి తాకట్టు పెడుతున్నది...ʹʹ అని మావోయిస్టు పార్టీ తెలంగాణ కమిటీ తన కరపత్రంలో పేర్కొన్నది.
ʹʹనీళ్ళు , నిధులు, ఉద్యోగాలు, భూముల కోసం ఎన్ కౌంటర్లు లేని తెలంగాణ కోసం దశాబ్దాలుగా పోరాడి సాధించుకున్న తెలంగాణాలో నేడు కనీస ప్రజాస్వామిక హక్కులు కూడా కరువయ్యాయి...ʹʹ అని మావోయిస్టు పార్టీ మండిపడింది.
అందుబాటులో అన్ని సాధనాలను ఉపయోగించుకొని గ్రామాల్లో, బస్తీల్లో అమరుల సంస్మరణ వారాన్ని విజయవంత చేయాలని ఆ పార్టీ ప్రజలకు పిలునిచ్చింది.

మరో వైపు ప్రజలు తమ కోసం ప్రాణాలర్పించిన అమరులను స్మరించుకుంటూ నిర్వహించే సభలను సమావేశాలను భగ్నం చేయడానికి పాలకులు అన్ని రకాల దుర్మార్గ ప్రయత్నాలు ప్రారంభించారు. ఒడిశా, విశాఖ, విజయనగరం జిల్లాల పోలీసు యంత్రాంగం వ్యూహత్మకంగానే వ్యవహ రిస్తోంది. విశాఖ ఏజెన్సీలోని అన్ని పోలీసుస్టే షన్ల పరిధిలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. విశాఖ ఏజెన్సీలోని మారుమూల,ఒడిశా సరిహద్దు, క టాఫ్ ఏరియాలో గాలింపు చర్యలకు పోలీసు యంత్రాంగం సిద్ధమైందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రస్తుతం అన్ని పోలీసు స్టేషన్లలో అదనపు పోలీసు బలగాలను అందుబాటులో ఉంచారు. ఒడిశాలోని అవుట్ పోస్టులలోను ప్రత్యేక పోలీసు బలగాలను అప్రమత్తం చేశారు. బలిమెల రిజర్వాయర్లో లాంచీల ప్రయాణాలపైన పోలీసు బలగాలు ప్రత్యేకంగా దృష్టి పెట్టాయి. విశాఖ ఏజెన్సీకి సంబంధించి కొయ్యూరు, చింతపల్లి, జీకే వీధి,జి.మాడుగు ల, పెదబయలు, ముంచంగిపుట్ మండలాల్లోని మారుమూల గ్రామాలు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలుగా గుర్తింపు పొందడంతో ఆయా పోలీసుస్టేషన్ల పరిధిలోని పోలీసు బృందాలతో పాటు జర్రెల, రాళ్లగెడ్డ, రూడకోట అవుట్ పోస్టులకు చెందిన ప్రత్యేక పోలీసు బల గాలు కూడా అప్రమత్తమయ్యాయి.
అంతే కాక తెలంగాణ లోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, పెద్దపల్లి, ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి , విశాఖపట్నం, విజయనగరం, ఒరిస్సాలోని మల్కన్ గిరి, కోరాపుట్, రాయగడ, గజపతి జిల్లాల్లో మహారాష్ట్ర లోని గడ్చిరోలి, చత్తీస్ గడ్ లోని, బస్తర్, భీజాపూర్, దంతెవాడ, సుక్మా, నారాయణపూర్, కాంకేర్ జిల్లాలలో, బీహార్, జార్ఖండ్ లలో పోలీసులు హై అలర్ట్ ను ప్రకటించారు.
పోలీసులు ఎన్ని ఆటంకాలు కల్పించినా పల్లె పల్లెనా అమరుల సంస్మరణ సభలు వుజయవంత చేయడానికి పోరాట ప్రజానీకం సిద్దమవుతున్నారు.

No comments:

Post a Comment