Wednesday, August 29, 2018

from India against arrests


ఆయన వెటకారంపై జనాల కసి...విప్లవానికి దారికి తీసింది
ఆయన దేశవ్యాప్తంగా ఉన్న మేధావులు, పౌర హక్కుల, ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలపై మహారాష్ట్ర పోలీసులు చేస్తున్న దాడుల నేపథ్యంలో ʹఅర్బన్ నక్సలైట్ʹ అనే పదం చర్చనీయాంశం అయ్యింది. బాలివుడ్‌ చిత్ర దర్శకుడు, నిర్మాత, స్క్రీన్‌ప్లే రచయిత వివేక్‌ అగ్నిహోత్రి ʹఅర్బన్‌ నక్సల్‌ʹ శీర్షికతో స్వరాజ్య పత్రికలో 2017, మే నెలలో ఓ వ్యాసం రాశారు. ʹఅర్బన్‌ నక్సలైట్లంటే పట్టణాల్లో ఉండే మేధావులు. ప్రభావశీలురు. ప్రాముఖ్యత కలిగిన కార్యకర్తలు, వారు భారత దేశానికి కనిపించని శత్రువులు. రాజ్యానికి వ్యతిరేకంగా విప్లవాన్ని రాజేసేవారుʹ అని పేర్కొన్నారు. ఆ తర్వాత ఓ సందర్భంలో వీరిని కేంద్ర ఆర్థిక మంత్రి ఆరుణ్‌ జైట్లీ ʹహాఫ్‌ మావోయిస్ట్స్‌ʹగా వర్ణించారు. రహస్య కేటగిరీకి చెందిన వీరు భారత ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకారులుగా ఆయన ట్వీట్‌ కూడా చేశారు.
అయితే నిన్న అదే వివేక్ అగ్నిహోత్రి వెటకారంగా మీరు కూడా అర్భన్ నక్సలైట్ అయితే మీ లిస్టు చెప్పండంటూ ట్విట్టర్లో ఒక పోస్టు పెట్టాడు. అయితే అతని వెటకారమే సోషల్ మీడియాలో విప్లవంలా మారింది. అన్యాయానికి, అక్రమాలకు వ్యతిరేకంగా నా గళం వినిపించినప్పుడు నన్ను నీవు అర్బన్ నక్సల్ అనుకుంటే నేను కూడా అర్బన్ నక్సల్‌నే అంటూ (#MeTooUrbanNaxal) పోస్టులు పెట్టారు. గత రెండు రోజులుగా దేశవ్యాప్తంగా జరుగుతున్న అరెస్టులు, సోదాల నేపథ్యంలో ఈ హాష్ ట్యాగ్ ట్రెండింగ్ అయ్యింది. లక్షల సంఖ్యలో నెటిజన్లు నేనూ అర్బన్ నక్సల్‌నే అంటూ ట్వీట్లు చేస్తూ ప్రభుత్వం చేయిస్తున్న అరెస్టులను నిరసిస్తున్నారు. ఇలా వెటకారంగా పెట్టిన హ్యాష్ టాగ్ ఇంతింతై అన్నట్లుగా నేడు దేశంలో ట్రెండింగ్ టాపిక్‌గా మారిపోయింది.

No comments:

Post a Comment