ఆయన వెటకారంపై జనాల కసి...విప్లవానికి దారికి తీసింది
అయితే నిన్న అదే వివేక్ అగ్నిహోత్రి వెటకారంగా మీరు కూడా అర్భన్ నక్సలైట్ అయితే మీ లిస్టు చెప్పండంటూ ట్విట్టర్లో ఒక పోస్టు పెట్టాడు. అయితే అతని వెటకారమే సోషల్ మీడియాలో విప్లవంలా మారింది. అన్యాయానికి, అక్రమాలకు వ్యతిరేకంగా నా గళం వినిపించినప్పుడు నన్ను నీవు అర్బన్ నక్సల్ అనుకుంటే నేను కూడా అర్బన్ నక్సల్‌నే అంటూ (#MeTooUrbanNaxal) పోస్టులు పెట్టారు. గత రెండు రోజులుగా దేశవ్యాప్తంగా జరుగుతున్న అరెస్టులు, సోదాల నేపథ్యంలో ఈ హాష్ ట్యాగ్ ట్రెండింగ్ అయ్యింది. లక్షల సంఖ్యలో నెటిజన్లు నేనూ అర్బన్ నక్సల్‌నే అంటూ ట్వీట్లు చేస్తూ ప్రభుత్వం చేయిస్తున్న అరెస్టులను నిరసిస్తున్నారు. ఇలా వెటకారంగా పెట్టిన హ్యాష్ టాగ్ ఇంతింతై అన్నట్లుగా నేడు దేశంలో ట్రెండింగ్ టాపిక్‌గా మారిపోయింది.
No comments:
Post a Comment