Thursday, February 22, 2018

India - long live AZAD! SUPPORT PEOPLE'SWAR! - Intensify intenrational support - ICSPWI -csgpindia@gmail.com

ఆజాద్ ఎన్ కౌంటర్ కేసు తీర్పు – న్యాయ పర్యావసనాలు
ఆజాద్ ప్రెస్ నోట్....
15 ఫిబ్రవరి 2018న అదిలాబాద్ జిల్లా అదనపు సెషన్ జడ్జి మావోయిస్టు పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు, అధికార ప్రతినిధి ఆజాద్, జర్నలిస్టు హేమచంద్ర పాండేల ఎన్ కౌంటర్ కేసులో
ఇచ్చిన తీర్పు పలు విధాలా ప్రాధాన్యమైనది. మొట్టమొదటి సారిగా 6000లకు పైగా ఎన్ కౌంటర్ హత్యలు జరిగిన తెలుగు రాష్ట్రాలలో కోర్టువిచారణ స్థాయివరకు చేరుకున్న మొదటి కేసు ఇదే. ఒక CI, మరో SI తో సహా మొత్తంగా 29 మంది స్పెషల్ పోలీసు పార్టీ కోర్టుకు హాజరై న్యాయవిచారణఎదుర్కోవాల్సి వుంది. జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పుకు దారితీసిన సుదీర్ఘ వ్యాయాపోరాటాన్ని, ఈ తీర్పు ఆధారంగా జరగబోయే పర్యావసనాలను వివరించేందుకే ఈ పత్రికా సమావేశం.
½ జులై 2010 అర్ధరాత్రి అదిలాబాద్, వాంఖిడి పోలీసు స్టేషన్ పరిధిలోని సర్కేపల్లి –వెల్గి అడవుల్లో జరిగినట్లుగా క్రైమ్ నంబరు 40/10గా స్థానిక పోలీసులు నమోదు చేసిన ఈ కేసులో మావోయిస్టు నేత, అప్పటి కేంద్ర ప్రభుత్వంతో చర్చల ప్రతినిధిగా ఉన్న ఆజాద్ @ చెరుకూరి రాజ్ కుమార్ తో పాటు ఫ్రీ లాన్స్ జర్నలిస్టు హేమచంద్రపాండే ఈ ఎన్ కౌంటర్లో చనిపోయారు. ఈ సంఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు, చివరకు పార్లమెంట్ లో కూడా పెద్ద చర్చ జరిగింది. అప్పటి హోమ్ మంత్రి చిదంబరం ఈ ఎన్ కౌంటర్ పై న్యాయవిచారన జరపడాన్ని తిరస్కరించడంతోహేమచంద్ర పాండే భార్య బాబిత, చర్చల మధ్యవర్తి స్వామి అగ్నివేస్ లు సుప్రీం కోర్టులో కేసు వేసి CBI విచారణకు ఆదేశాలు పొందారు.. 2011లోనే కుట్ర, హత్యానేరం నమోదు చేసి దర్యాఫ్టు చేసిన CBI తుదకు పోలీసు ఎన్ కౌంటర్ లోనే వారు చనిపోయారని బాధితులు ఆరోపించినట్లుగా కాదని, కాబట్టి కేసును విచారణకు సాక్ష్యాధారాలు లేని కేసుగా మూసివేయాలని తుది నివేదికను సమర్పించడంతో ఈ కేసు విచారణపై అభ్యంతరాలు,మరేవైనా సాక్ష్యాధారాలు ఉంటే అదిలాబాద్ స్థానిక కోర్టులో తేల్చుకోండని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది.
ఆ విధంగా కేసు 2010లోనే అదిలాబాద్ మేజిస్త్ఱేట్ కోర్టుకు చేరుకున్నా జైలులో ఉండి విడుదలయిన తర్వాత ఆజాద్ సహచరి కె. పద్మ, హేమ చంద్ర పాండే భార్య బబిత పాండేలు మే 2013 లో CBI తుది నివేదికను ఆక్షేపిస్తూ ప్రొటెస్ట్ పిటిషన్ వేసి కోర్టు విచారణ కోరగా 202 సి‌ఆర్ పి‌సి క్రింద కోర్టు విచారణకు స్వీకరించింది. బబిత, పద్మలతో పాటుగా స్వామి అగ్నివేష్ సాక్ష్యాలు, అలాగే ఈ కేసులో కీలకమైన ఆజాద్ పోస్ట్ మార్టం జరిపిన డాక్టర్ నీలకంఠేశ్వర్ రావుల సాక్ష్యాలను నమోదు చేసుకున్నారు. ఐతే డాక్టర్ నీలకంఠేశ్వర్ రావు సాక్ష్యం చెప్పడాన్ని CBI వ్యతిరేకించింది. నిజానికి ఆ సాక్ష్యమే కేసులో చాలా కీలకమైనది. ఎందుకంటే పోలీసులు చెప్పిన విధంగా దూరం నుంచే ఎదురు కాల్పులు జరిగాయని మిగతా డాక్టర్లు నివేదికను ఇవ్వగా, ఆజాద్ కు శవ పరీక్ష చేసిన డాక్టర్ నీలకంఠేశ్వర్ రావు వారితో విభేదించి అతి దగ్గరగా కాల్పులు జరిగాయి అనే నివేదిక ఇచ్చారు.
అయితే తదనంతరం జరిగిన వాదనలలో మిగతా సాక్ష్యులు చేసిన ఆరోపణలు గానీ డాక్టర్ నీలకంఠేశ్వర్ రావు సాక్ష్యాన్ని కానీ, ఎన్ కౌంటర్ తీరు పైన న్యాయవాదులు లేవనెత్తిన ప్రశ్నలను పరిగణనలోకి తీసుకోకుండా 2015 మార్చి 24 నాడు అదిలాబాదు మేజిస్ట్రేట్ ఈ కేసు విచారణకు అర్హమైన కేసు కాదని కొట్టివేసింది.
దానిని వ్యతిరేకిస్తూ పునర్విచారణ కోరుతూ పద్మ ఆజాద్,బబితా పాండేలు అదిలాబాదు జిల్లా కోర్టులో క్రిమినల్ రివిజన్ పిటిషన్లు 2015లో వేయగా, నిజానికి 2016 జనవరిలో వాదనలు, మేలో రాతపూర్వక వాదనలు విన్న అప్పటి జిల్లా ఫ్యామిలీ కోర్టు 2018 మే 31నాడు తీర్పుకు తేదీని ఖరారు చేసి కూడా తీర్పు ప్రకటించక మళ్ళీ వాదనలకోసం పెండింగ్ పెట్టారు. ఆ తరువాత 2 సంవత్సరాలుగా అంటే 2016 జనవరి నుంచి 2018 జనవరి వరకు ఇద్దరు జడ్జిల దగ్గరకి కేసు వచ్చినా అటు వాదనలు వినలేదు, ఇటు తీర్పూ చెప్పలేదు. సరిగ్గా ఈ స్థితిలో ఫ్యామిలీ కోర్టు సెలవు కారణంగా ఇన్ చార్జీ బాధ్యతలో ఉన్న SC ST స్పెషల్ కోర్టు అదిలాబాదు 5వ జిల్లా అదనపు జడ్జి దగ్గర 2018జనవరి 11నాడు ఈ కేసును సత్వరమే చేపట్టాలని ఇప్పటికే చాలా కాలాయాపన జరిగిందని విన్నవించగా వేనువెంటనే స్పందించిన జిల్లా జడ్జి శ్రీమతి జీవి ఎన్ భారత లక్ష్మి వాదనలు వినడం కోసం 2018 జనవరి 24 వ తేదీ ఖరారు చేయగా ఆ రోజున బాధితుల తరఫున న్యాయవాదులు డి. సురేష్ కుమార్, వి. రఘునాథ్ లు CBI తరఫున అలెగ్జాండర్ లెనిన్ వాదనలు ముగించారు. ఫిబ్రవరి 15ను తీర్పు కోసం తేదీని ఖరారు చేయడమే కాకుండా మూడేళ్ళుగా మిగతా జడ్జిల దగ్గర నానుతూ వచ్చిన కేసులో కీలకమైన తీర్పును కేవలం మూడవ వాయిదాలో ప్రకటిస్తూ , క్రింది కోర్టు తీర్పును తిరస్కరిస్తూ 29 మంది పోలీసులపై న్యాయ విచారణ ప్రక్రియను చేపట్టాల్సిందిగా జిల్లా కోర్టు ఆదేశాలు ఇచ్చింది.
సంచలనాత్మకమైన ఈ తీర్పుతో అదిలాబాద్ కోర్టులో ఆజాద్ ఎన్ కౌంటర్ కేసులో తొలి న్యాయవిచారణ ప్రారంభం కానుంది.
అసాధారణమైన తీర్పు సాధారణమైన కృషితో రాలేదు. సుప్రీం కోర్టు CBI విచారణకు ఇచ్చిన ఆదేశాల కారణంగా 169 పేజీల తుదినివేదికతోపాటు 87 మండి సాక్షుల వాంగ్మూలాలు, 78 డాక్యుమెంట్లు మొత్తం 4 వాల్యూమ్ లలో వేశారు. దానితోపాటుగా అదిలాబాద్ మేజిస్ట్రేట్ జరిపిన 202 విచారణలో పద్మ, బబిత, స్వామి అగ్నివేష్, డాక్టర్ నీలకంఠేశ్వర రావుల సాక్ష్యాలను అలాగే కేసుకు సంబంధించి 16 కీలక ప్రశ్నలను, శవ పరీక్ష నివేదికలోని పలు అంశాలతోపాటుగా చట్ట ప్రకారంగా ఆత్మరక్షణలో భాగంగాజరిగే అసహజ మరణాలను హత్యానేరం క్రింద కోర్టు న్యాయ విచారణలో మాత్రమే నిరూపించబడి, నిందితులు దోషరహితులుగా సేషన్స్ కోర్ట్ తీర్పుతో మాత్రమే కేసునుంచి బయట పడగలరు తప్ప పోలీసులో,CBI చేసే దర్యాఫ్టు నివేదికలతో కాదు అని బాధితుల తరఫున చేసిన వాదనలను కోర్టు పూర్తిగా సమర్ధించింది.
దీని పర్యవసానంగా రాష్రంలో ఎన్ కౌంటర్ హత్యలకు వ్యతిరేకంగా జరుగుతున్న న్యాయపోరాటానికి, ప్రజా పోరాటాలకి ఎంతో నైతిక, న్యాయపరమైన విజయం లభించింది. ఇకపై సాక్ష్యాధారాలున్న కేసులు హై కోర్టును రిట్ కోసం ఆశ్రయించాల్సిన అవసరం లేకుండా నేరుగా ఫిర్యాదుల రూపంలో ఎన్ కౌంటర్ హత్యా కేసులను నిరూపించుకోగలిగే అవకాశం క్రింది కోర్టుల్లోనే ఆయా స్థానిక కోర్టులలోనే ఉన్నదని ఈ కేసు విజయం సూచిస్తోంది.
అటువంటి న్యాయపోరాటాన్ని ప్రజాన్యాయవాదులుగా హక్కుల కార్యకర్తలుగా ప్రజా సంఘాలుగా ఇందుకు తగిన కేసులను ఎన్నుకొని చేస్తామని, ఆ కృషిలో అన్నీ ప్రజా సంఘాలు, ఎన్ కౌంటర్ బాధిత కుటుంబ సభ్యులు మాకు లేదా ఇలాంటి ప్రయత్నం చేసే న్యాయవాదులకు ప్రజా కార్యకర్తలకు సంఘాలకు సహకరించి ఆరు వేలకు పైగా జరిగిన ఎన్ కౌంటర్ హత్యాకాండ వ్యతిరేక పోరాటంలో సరికొత్త న్యాయపోరాటానికి నాంది పలకడానికి ఆజాద్ ఎన్ కౌంటర్ తీర్పు స్ఫూర్తినిస్తుంది.
ఎం. వెంకన్న (ఐ ఏ పి ఎల్ ): డి. సురేష్ కుమార్ (అడ్వకేట్. ఐ ఏ పి ఎల్) వి. రఘునాథ్ అడ్వకేట్, సి ఎల్ సి : వరవరరావు (విరసం) కే. పద్మ : లక్ష్మి దేవి (రియాజ్ సహచరి)

No comments:

Post a Comment