Wednesday, November 21, 2018

India - freedom for Varavara Rao - Saibaba and all political prisoners in India - Internationalist Meeting Italy - 8th december Milan h.10 info csgpindia@gmail.com

ప్రజా
పీడిత ప్రజల గొంతుక వరవరరావు అరెస్ట్ కు వ్యతిరేకంగా పోరాడుదాం!!
‌ప్రశ్నించే గొంతులను కాపాడుకుందాం!!
‌నిర్బంధం నీ ఇంటి తలుపు తట్టక ముందే ఐక్యమవుదాం.
‌ఇప్పటికైనా మౌనం వీడుదాం
‌ప్రజాస్వామిక హక్కులను కాపాడుకుందాం -TDF


‌ప్రియమైన ప్రజలారా!!
‌ప్రజా స్వామిక వాదులారా!!

దేశవ్యాప్త ప్రజాస్వామిక వాదుల నిర్బంధం,లౌకిక వాదుల,హేతువాదుల హత్యలు, పీడిత ప్రజల పై ప్రధానంగా ఆదివాసుల, దళితుల,మత మైనారిటీ ప్రజల పై అమానవీయ దాడుల పరంపర కొనసాగింపుగా నేడు ఏకంగా ఈ దేశ ప్రధాని నరేంద్రమోడీ తనను హత్య చేసేందుకు మావోయిస్టు పార్టీ కుట్ర చేసిందని, "బీమా కోరేగాం కుట్ర కేసు" ",ఎల్లార్ పరిషత్ కేసు" అల్లి పీడిత ప్రజల
గొంతుక వరవరరావు ను రెండున్నర నెలలపాటు గృహ నిర్బంధం చేసి ఈ నెల 17న అరెస్టు చేసి మహారాష్ట్ర లోని ఆదివారం ఉదయం పుణే సెషన్స్ కోర్టులో హాజరుపరిచి ఈ నెల 26 వరకు పోలీసు కస్టడీలోకి తీసుకున్నారు. అసలు ఈ కేసులు అభూత కల్పనస్లు,కట్టుకథలు అని మొత్తం సభ్య సమాజం భావిస్తోంది. దేశంలోని చరిత్రకారులు రోమిల్లాతఫర్ వంటి మేధావులు, ప్రముఖ న్యాయ కోవిధులు స్పందించారు. సుప్రీంకోర్టు మెట్లు ఎక్కి ఇది ప్రజా ప్రజాస్వామ్యం లో భిన్నాభిప్రాయాలను,భిన్న భావజాలంపై డాడీ మొత్తం భావవ్యక్తీకరణ హక్కును కాలరాయడమే కాదు,రాజ్యాంగ పీఠిక నే ప్రశ్నర్ధకంగా మరి ప్రమాదంలో పడిందని ఏ దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు మొర పెట్టుకున్నారు. స్పందించిన సుప్రింకోర్టు భిన్నాభిప్రాయం ప్రజా స్వామ్యానికి సేఫ్టీవాల్ వంటిదని దానిని నిరాకరిస్తే ఫ్రెషర్ కుక్కర్ వాలే పేలుతదని వ్యాఖ్యానించి గృహ నిర్బంధం వరకు పరిమితము చేసి పలు దఫాలుగా వాదనలు విని సుప్రింకోర్టు కూడా చేతులెత్తేసినది. దీనితో సుప్రింకోర్టు కూడా ఏ విధంగా ఫాసియిజం పాలన లో ప్రభావితమైందో ప్రజా స్వామ్య ప్రేమికులు అర్ధం చేసుకోవచ్చు. ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా చెప్పబడుతున్న ఈ దేశంలో ఇపుడు ఉన్నది, నడుస్తున్నది ప్రజాస్వామ్యమేనా..?? అమలు జరిగేది చట్ట ప్రకారం నడుస్తున్న పాలనేనా?? అని దేశంలో ని ప్రజలు, ప్రజాస్వమిక వాదులు, వామపక్షా పార్టీలు సామాజిక కార్యకర్తలు ఆందోళనబాట పడుతున్న వైనం. మరొక వైపు ఇవాళ సంప్రదాయ పార్లమెంటరీ పార్టీలు కూడా కాంగ్రెస్ ,పలు ప్రాంతీయ పార్టీలు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రజా స్వామ్యమును కాపాడడానికి, రాజ్యాంగ హక్కుల పరి రక్షణ అంటూ జాతీయ కూటమి గడుతున్న స్థితితో అర్ధము చేసుకోవచ్చు.

‌"ప్రధాని హత్య కుట్ర జరిగిందా?"
‌ఈ హాస్యాస్పద కట్టుకథల కుట్ర కేసుకు నరేంద్రమోదీ ఎందుకు తెరతీసారు?
‌ఎందుకు ఇంత బరితెగించి నట్టు??
‌ఈ ప్రశ్నలకు జవాబులను వేతకాలంటే హిందూ ఫాసిస్టు శక్తుల మూలలోకి వెళ్లాల్సిందే. నాడు అంతర్జాతీయ మీడియా సమక్షంలో బహిరంగంగా బాబ్రీ ని కూల్చే దుండగానికి పాల్పడి,దేశ ప్రతిష్ఠ కి ఏనాలేని మచ్చ తేవడమేగాక లజ్జ ని వదిలి చివరికి ఆ ఘోరాన్ని "స్వతంత్రోద్యమము"గా వర్ణించేందుకు తెగబడిన మతతత్వ భారతీయ జనతా పార్టీ శక్తులైన వీరు గోద్రా దూరంతం లోనూ, సంఘపరివార్ సంస్థలు దగ్గర ఉండి జరిపించిన గుజరాత్ మారణకాండలోను( రెండు నుండి మూడు వేల మందిని బలి తీసుకున్న) ముందుండి నాయకత్వం వహించిన భాద్యులలో నంబర్ వన్ ఇవాళ దేశానికి ప్రధానమంత్రి గా దేశాన్ని ఫాసిజంలోకి తీసుకెలుతున్న నరేంద్రమోదీ, రెండవవాడు ఈ దేశాన్ని బహుశా జాతి కంపెనీలకు, అంబానీలకు అమ్ముతున్న భారతీయ జనతా పార్టీకి అధ్యక్షుడు అమిత్ షా .
‌ఈ హంతక ధ్వయమైన నాడు గుజరాత్ ముఖ్యమంత్రి గా,హోంమంత్రిగా రాజ్యాంగ పదవులలో ఉండి గోద్రా వీదుల్లో హంతక తండాలకి నాయకత్వం వహించి, దగ్గర ఉండి హత్యలు, గృహ దహనాలు, సామూహిక మాన భంగాలు, సజీవ దహనాలు, గ్యాస్ బండల్ని ఇళ్ళల్లోకి విసిరి పేల్పించి, కాలనీలకు కాలనీలు, వీదులకు వీదులను, ముస్లిం ప్రజలను కీటకాలను చంపినట్లు గా...చంపించిన...
‌వందల సంఖ్యలో మసీదుల్ని కులగొట్టించి లక్షన్నర మంది ప్రజలు సర్వమూ కోల్పోయిన శరణార్ధ శిబిరాల్లో కాలం వెళ్లదీసేలా పరిస్థితి కల్పించి, పది వేల కోట్ల రూపాయల ఆస్థి బూడిద కావడానికి కారకులైన వీరి బండారాన్ని ప్రపంచనికి తెలియజేసేందుకు నాడు వరవరరావు తన సామాజిక బాధ్యత లో భాగంగ క్రియాశీలక పాత్ర పోషించారు. నాడు అంటే 2002లో విరసం నేతృత్వంలో అంటే సహజంగా నే విరసంలో క్రియాశీలక రచయిత వరవరరావు మరియు దేశవ్యాప్తంగా ఉన్న సామాజిక కార్యకర్తలు, రచయితలు,బుద్ది జీవులు గుజరాత్ భాదితులకు సంఘీభావం తెలిపేందుకు, గుజరాత్ పర్యటించి, అక్కడ యేమి జరిగిందో బయటి ప్రపంచానికి తెలిపారు.

‌ ఆ సందర్భంగా వరవరరావు "హిందువుగా పుట్టినందుకో, అగ్రవర్ణంలో పుట్టినందుకో, ఎవరైనా చేయాగలిగింది ఏమీలేకపోవచ్చు. కానీ ఇవాళ గుజరాత్ లో ముస్లింల పై, వాళ్ళ స్త్రీలపై , పిల్లల పై జరిగిన బీభత్స హత్యాకాండ, విధ్వంస కాండ, వాటి అమానుష రూపాలు-చూసి కూడా ఏ మూలనయినా ముస్లిమేతర హృదయాలు స్పందించకపోతే మాత్రం మానవత్వానికి భవిష్యత్ లేదు. ఏ దేశంలో హిందువుగా పుట్టి ,సెక్యులర్, ప్రజాస్వామ్యవాదినని చెప్పుకునే అర్హత లేదు. హక్కు మిగలదు" "కవులుగా, రచయితలుగా మనం ఆ నీడల్ని నిజమైన ప్రశ్నించే శక్తులు గా మార్చే సమీకరణ కు, సంఘీభావానికి నడుము కడుదాము. గుజరాత్ ఇవ్వాళ తనను కాపాడానికే కాదు , అక్కడితో ఆగకుండా దేశమంతా విస్తరిస్తున్న ఫాసిజాన్ని ప్రతిఘటించడానికి దేశంలోని సెక్యులర్, ప్రజా స్వామిక, విప్లవ శక్తులను ఆదేశింస్తున్నాది"- వరవరరావు )

‌ఇలా ఎరుక పర్చి దేశంలోని బుద్ధిజీవులను, లౌకికవాదులను ఏకం చేయడానికి చొరవ చేసిన మేధావి వరవరరావు.
‌ఈ స్పందన ను రాజకీయ లబ్ధి కోసం అవకాశవాదం కోసమైనా నాడు మోడీ ప్రభుత్వవాన్ని బర్తరఫ్ చేయాలని, గుజరాత్ లో వెంటనే ఎన్నికలు నిర్వహించకూడదనీ తెలుగు దేశం చంద్రబాబు అంటూ కొద్దీ రోజులైనా నాటకమడక తప్పలేదు. (అంటే ఇప్పుడు వరవరరావు ఈ విధంగా, ఆ చంద్రబాబు కూడా నేడు మోడీ కి రాజకీయంగానే కాదు వ్యకిగతంగానూ టార్గెట్ కావడం అంటే ఆక్సిడెంటల్ కాదు. మోడీ మనస్తత్వం లోని వ్యక్తిగత ఇగో తీర్చుకొనేందుకు పగ, ఖచ్చ కనబడుతోంది.)దాంతో సోకల్డ్ లౌకిక ఎన్నికల పార్టీలు కూడా మతతత్వ పార్టీకి దూరం జరిగి ఓ 10 ఏళ్లు హిందూమతోన్మాద శక్తులును ఢిల్లీ గద్దెనెక్కకుండా, అధికారంలోకి రాకుండా అడ్డుకోగల్గారు.

‌సోనియా నేతృత్వంలోని మన్మోహన్ సింగ్ ప్రధాని గా యూపీఏ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలన తోడు, బహుళ జాతి కంపెనీల దన్నుతో , కార్పొరేట్ మీడియా మాయాజాలం లో 2014లో అధికారంలోకి వచ్చిన మోదీ, అమిత్ షా లు దేశంలోని సహజ సంపదను, వనరులను, ప్రజల సంపదను ప్రపంచ దోపిడి శక్తులకు, అంబానీలకు, నిరావ్ మోడీ, లలిత్ మోదీ వంటి ఆర్థిక నేరస్తులకు దోచిపెడుతూ, ఇందుకు శరవేగంగా చట్టాలను సవారిస్తు దేశాన్ని దివాళా తీయిస్తూ, మధ్య భారతంలో "ఆపరేషన్ సమాధాన్" పేరుతో ఆదివాసీ జినోసైడ్ కొనసాగిస్తోంది. మొత్తం పరిస్థితులనుండి ప్రజలనుండి తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కొంటు మరో 6 నెలలలో ఎన్నికలకు వస్తున్నారు. మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు.. కేవలము కుర్చీలో కొనసాగేందుకు యావత్తు దేశాన్ని స్మశానంగా మార్చడానికి సైతం వెనకాడకుండా ఉండేందుకు ముస్లిమైతే టెర్రరిస్టు, ISI, "ఆదివాసీలను మావోయిస్టు" లౌకిక వాదులను దేశద్రోహులుగా, దళితులను ఆహారపుఅలవాట్లు మాటున చంపడం, మహిళలను సంప్రదాయం,భక్తీ పేరుతో అయ్యప్పస్వామి గుడులకు నిరాకరణ, దాడులు, మొత్తం ఈ అప్రజాస్వామిక పాలన పై విభేదిస్తే "అర్బన్ మావోయిస్టు" పేరుతో ప్రజా స్వామ్య వాదులను, హక్కుల కార్యకర్తల పై తప్పుడు కేసులు నమోదు చేసి జైళ్లలో నిర్బంధం చేయడం ఒక విధానం గా అమలు చేస్తున్నారు. ఆఖరికి ఆపరేషన్ గ్రీన్ హంట్ మొదలు పెట్టిన కాంగ్రెస్ పార్టీ నేతలకు కూడా అర్బన్ మావోయిస్టుల లింకులు ఉన్నాయని మోడీ గ్లోబెల్స్ ప్రచారం తో బరితెగించి పోతున్నాడు.
‌ఒకనాటి మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, AICC అధికార ప్రతినిధి దిగ్విజయ్ సింగ్ నుకుడా ఈ కుట్ర కేసుల్లో ఇరికించాలని చూస్తోంది.

‌ఈ నేపథ్యంలో వరవరరావు అరెస్ట్, జైలు నిర్బంధం తో దేశంలో మోడీ హిందుత్వ పాసిజం పరాకాష్ట కు చేరుకున్నదని అర్థం చేసుకోవచ్చు. భారత ప్రజల్ని మొత్తం హిందూ సమాజంగా మార్చేందుకు నరేంద్రమోదీ, అమిత్ షా నాయకత్వంలోని హిందు ఫాసిస్టు శక్తులు కాస్మిర్ నుండి కన్యాకుమారి వరకు భారత దేశంలోని పల్లెల నుండి దేశ రాజధాని ఢిల్లీ వరకు ప్రజలను ప్రజాస్వామిక వాదులను అణచివేతకు పాల్పడుతోంది.దీన్ని ఒక విధానం గా అమలు చేస్తూ అక్రమ కేసులతో జైళ్లలో నిర్బంధించడాలు, లౌకిక వాదుల,హేతువాదులను హత్యలు చేయడం. మొత్తము రాజ్యాంగ సంస్థలను ధ్వంసం చేస్తూ దేశంలో క్రూరమైన ఫాసిస్టు, అప్రకటిత ఎమర్జెన్సీ పాలన కొనసాగిస్తున్న బీజేపీ మోడీత్వ పాలనకు అన్ని రాష్ట్రాలలోని పాలన యంత్రాంగం సహకరిస్తోంది.

‌ఫాసిస్టు మోడీకి నయా నియంత కేసీఆర్ తోడైండు!!

‌ఏ ఆకాంక్షల కోసమైతే తెలంగాణ కోసం ప్రజలు పోరాడి సాధించుకున్న తెలంగాణ లో ఇవాళ జీవిత కాలం ,పిడితుల కోసం, సమాజంలో భాగంగా ప్రజా తెలంగాణ కోసం తన జ్ఞానం ను, ఆలోచనలను పంచిన వరవరరావు ను మోడీ పోలీసులకు పట్టివ్వడంలో, అక్రమ నిర్భంధ నికి గురిచేయడంలో కేసీఆర్ ప్రభుత్వం తక్కువేమీ తినలేదు. ప్రత్యామ్నాయ భావజాలాన్ని కార్యాచరణ గా ఎంచుకొని, విప్లవ రచయితగా, విరసం వ్యవస్థాపక సభ్యులు గా, తెలంగాణ రైతాంగం సాయుధ పోరాటం పై చరిత్రక పరిశోధన చేసి, దాదాపు 12 సంవత్సరాల జైలు జీవితాన్ని తన జీవిత ఉద్యమాచరణగా ప్రజల వైపు నిలబడ్డ కవి వరవరరావు తెలుగు సమాజమే కాదు ప్రపంచ పోరాటాలకు వీర తెలంగాణకు ప్రత్యేక స్థానం ఆ తెలంగాణ పోరు బిడ్డ వరవరరావు అరెస్ట్ గురించి, విడుదల కోసం ఉద్యమ నిర్మాణం కోసం తెలంగాణ ప్రజా స్వామిక వేదిక పత్రికా సమావేశం ఈ నెల 18న సుందరయ్య విజ్ఞాన కేంద్రం లో కూడా జరగనియకుండా నిర్బంధము ను అమలు చేస్తున్నాడు. రోడ్డు పైననే పత్రికా సమావేశం నిర్వహించుకోవాల్సి వచ్చింది.

‌ఇందుకోసమేనా తెలంగాణ అని ఎన్నికల్లో ఓట్లకు వస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి నేతలను తెలంగాణ ప్రజలు అడ్డుకుంటున్నారు. తెలంగాణ ఉద్యమం నాటి ప్రాజాస్వామిమ ఆకాంక్ష లు ఈ ఎన్నికల్లో ఏమయ్యాయి??

‌"మావోయిస్టు ఎజెండా నే నా ఎజెండా" అని గద్దెనెక్కిన కేసీఆర్ తెలంగాణ భుర్జువా వర్గ ప్రతినిధిగా అధికారంలోకి వచ్చి కనీస రాజ్యాంగ విలువను పాటించకుండా నయా నియంతగా మాట-ఆట, పాట, నలుగురు కుడితే నిషేధాలతో భారత రాజ్యాంగం లోని అదేశిక సూత్రాలకు, ప్రాథమిక హక్కులను కాలరాయడమే కాదు. రాజ్యాంగ సంస్థలను కూడా ఖాతరు చేయడం లేదు.
‌ఓట్ల కోసం మావోయిస్టు ఎజెండా అని కనీసం రాజ్యాంగం లోని పౌర హక్కుల్ని కూడా గౌరవించే ప్రజాస్వామిక దృష్టి ఆయనలో లేదు.
‌అధికారంలోకి రాగానే తొలి నాళ్ళలోనే కరెంటు సక్రమంగా ఇవ్వమన్న గజ్వేల్ రైతాంగము పై లాఠీ ఛార్జ్ చూపించాడు. వరంగల్ జైల్ నుంచి హైదరాబాద్ కోర్టుకు తీసుకొని వస్తూ బేడీలతో ఎస్కార్ట్ బస్సులో సీట్లకు కట్టివేసి వుండగానే ఆలేరు కండిగడ్డ తండా వద్ద ఎస్కార్ట్ పోలీసులే కాల్చి చంపారు. 2015 లో సెప్టెంబర్ 14 న వరంగల్ జిల్లా మేడారం అడవుల్లో శృతి-సాగర్ అనే మావోయిస్టులను పట్టుకొని క్రూరంగా ,చిత్రహింసలు పెట్టి చంపడం, దానికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు 370 సంఘాలు,9 వామపక్షా పార్టీల భాగస్వామ్యం తో తెలంగాణ ప్రజా స్వామిక వేదిక నిర్వహించిన చలో అసెంబ్లీ పై విధించిన నిర్బంధము విధించి రాష్ట్ర వ్యాప్తంగా 10 వేల మందిని అరెస్ట్ చేయడం,మల్లన్న సాగర్ నిర్వాసితుల పై లాఠీ దెబ్బలు గాని,ఆ 14 గ్రామాలలో మూడు నెలల పాటు 144 విధించడం, వరంగల్ లో మే 24 న తెలంగాణ ప్రజా స్వామిక వేదిక సభ పై జరిపిన పాశవిక నిర్భంధము గాని, రైతుల ఆత్మహత్యలను అడ్డుకోలేకపోయింది. ఎన్ కౌంటర్లు లేని సమాజాన్ని తెలంగాణ కోరుకుంది కానీ కేసీఆర్ ప్రభుత్వం తొలి రోజుల నుంచే తెలంగాణ బిడ్డల శవాల మీద ఊరేగుతన్నది. కనీసం నిరసన తెలిపే భావవ్యక్తీకరణ కూడా ఇందిరా పార్కు దగ్గర ధర్నా చౌక్ ను రద్దు చేయడం అంటే పోరాడి సాధిచుకున్న తెలంగాణ లో కేసీఆర్ పాలన అనేది చట్ట, న్యాయ, రాజ్యాంగ వ్యవస్థ లను మొత్తం కూల్చి పోలీసుల చేతిలో రాష్ట్రం పెట్టి గడిలా పాలన కొనసాగిస్తున్నాడు. అసలు తెలంగాణ లో సచివాలయ పని చేయదు, రాజ్యాంగ వ్యవస్థల అక్టివిటీ తెలంగాణా లో లేదంటే అతిశయోక్తి కాదు. ఈ హక్కుల పై నిరంతరం తెలంగాణ ప్రజలతో కలిసి ఉద్యమిస్తున్న తెలంగాణ ప్రజా స్వామిక వేదిక నాయకత్వాన్ని, నిజనిర్ధారణ బృందం ను అక్రమంగా దుమ్ముగూడెం దగ్గర చత్తిస్ ఘడ్ పోలీసులకు పట్టించి 6 నెలల పాటు సుకుమా జైల్లో నిర్బంధించడం, నెరేళ్ల ఇసుక మాఫియా నడుపుతూ దళితుల మరణాలకు కారణం అయినా దాని పై నిలదీసి అడ్డుకున్న నెరేళ్ల దళితులపై పోలీసులతో థార్డ్ డిగ్రి ప్రయోగించి ఇప్పటికి కోలుకోలేని నెరేళ్ల భాదితుల పరిస్థితి కానీ, మంథని మధుకర్ అనే దళితుడి హత్య గాని, మిర్యాలగూడలో ప్రణయ్ వంటి అగ్రకుల హంకార హత్యలు గాని, నిరుద్యోగ సమస్య పై ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఉద్యమానికి పునుకుంటే తెలంగాణ విద్యార్థి సంఘము నేత, టీడీఫ్ కన్వీనర్ కోట శ్రీనివాస్ పై ఉద్యమ కేసులు తిరగదొడడం, ఉపా కేసు పెట్టి జైల్లో నిర్బంధం కు గురి చేయడం గాని, పోడు భూముల ను సాగు చేసుకుంటున్న ఆదివాసీల ను తరిమికొట్టడం కానీ, వారి పై పీడీ యాక్టు కేసులు నమోదు చేయడం గానీ, న్యూడెమోక్రసీ కార్యకర్తల, నేతల పై ఉపా కేసులు పెట్టి జైళ్లలో పెట్టడం గానీ, నిరుద్యోగ సమస్యల పై మాట్లాడితే DSU భద్రి , రంజిత్,సుదీర్ ల పై ఉపా కేసు పెట్టి జైల్లోనే నిర్బంధము కు గురి చేయడం, హక్కుల గురించి మాట్లాడి ఉద్యమిస్తున్న తెలంగాణ ప్రజా స్వామిక వేదిక కన్వీనర్లు చిక్కుడు ప్రభాకర్, దుర్గాప్రసాద్, కోట శ్రీనివాస్ ల పై నిర్బంధం గాని , వరంగల్ లో పౌర హక్కుల సంఘం నాయకులు రమేశ్ చందర్, జాబాలీ లను అక్రమంగా అరెస్టు ఉపా కేసు పెట్టి వరంగల్ జైలులో 3 నెలల పాటు నిర్బంధం చేయడం, వీటికి ఆ పరంపర లో కొనసాగింపుగా ప్రజాస్వామిక తెలంగాణ కోసం ఉద్యమిస్తుం తెలంగాణ ప్రజాఫ్రాంట్ ప్రధాన కార్యదర్శి రమేష్, TYF న్యాయకత్వం మోహన్ రాజ్,పాండురంగరెడ్డి, గణేష్,శ్రీను,మరో ఇద్దరు కార్యకర్తలను ఎన్నికల ముందు అక్రమంగా అరెస్ట్ చేసి ఉపా కేసు నమోదుచేసి ఖమ్మం జైలు లో నిర్బంధించారు. ఇవాళ సింగరేణిలో ఓపెన్ కాస్ట్ వల్ల పర్యావరణ, నిర్వాసితుల సమస్య, నిరుద్యోగుల సమస్య పై కొనసాగుతున్న నిర్బంధం మొత్తం తెలంగాణ మౌలిక సమస్యల పై, గత హామీల పై ప్రజలను చైతన్య వంతం చేయడానికి TPF చేపట్టిన యాత్ర పై కోన సాగుతున్న నిర్భంధమును తెలంగాణ ప్రజా స్వామిక వేదిక తీవ్రంగా ఖండిస్తుంది. ఈ నయా నియంత కేసీఆర్ అప్రజాస్వామిక పాలనకు వ్యతిరేకంగా ఉద్యమించాలని , మోడీ ఫాసిజాన్ని విశాల ఐక్య ఉద్యమం తో ఎదుర్కొని పౌర ప్రజా స్వమిక హక్కుల రక్షణ కోసం బలమయిన ప్రజా స్వామిక పోరాటాలు నిర్మిద్దామని తెలంగాణ ప్రజా స్వామిక వేదిక పిలుపు నిస్తోంది.
‌ నిర్బంధము మన ఇంటి తలుపు తట్టకముందే మనము మేల్కొందాము. పీడిత ప్రజల గొంతు వరవరరావు అరెస్టు దేశవ్యాప్త హక్కుల నేతల, కార్యకర్తల పై కొనసాగుతున్న నిర్భంధ ము కు వ్యతిరేకంగా "ప్రశ్నించే గొంతులను కాపాడుకుందాము" అని పిలుపునిస్తూ ఈ నెల 25 న ఆదివారంనాడు హైదరాబాద్ లోని ఇందిరా పార్కు దగ్గర మహాధర్నా తలపెట్టినము. ఈ ధర్నా లో ప్రజలు, ప్రజా స్వామిక వాదులు, విద్యార్థులు, కార్మికులు, కర్షకులు, ఉద్యోగ సంఘాల, కవులు, కళాకారులు, మత మైనార్టీలు,మహిళలు, యువజనులు పీడిత ప్రజలంతా పెద్ద ఎత్తున కదలి వచ్చి విజయవంతం చేయాలని తెలంగాణ ప్రజా స్వామిక వేదిక పిలుపు నిస్తోంది.

No comments:

Post a Comment