https://www.youtube.com/watch?v=22dYGXh7vMc
Farmers Protest:బీజేపీ నాయకులను వెంటపడి తరిమి కొట్టిన రైతులు
11-07-2021
కేంద్రం తీసుకవచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దాదాపు పది నెలలుగా దేశ రైతాంగం పోరాటం చేస్తున్నారు. ఢిల్లీ సరిహద్దుల్లో వేల మంది రైతులు రాత్రనక పగలనక, ఎండలో, వానలో, చలిలో ధీక్ష కొనసాగిస్తూనే ఉన్నారు. వివిధ రాష్ట్రాల్లో ప్రతి ఊరిలో నిరసనలు సాగుతున్నాయి. పంజాబ్, హర్యాణా, ఉత్తరప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో బీజేపీ నాయకులను గ్రామాల్లోకి రానివ్వడం లేదు రైతులు. ఆ పార్టీ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఏ కార్యక్రమం కూడా నిర్వహించుకోలేని పరిస్థితి కల్పించారు. పలు మార్లు హర్యాణా ముఖ్యమంత్రి రైతుల నిరసనల వల్ల కార్యక్రమాలను రద్దుచేసుకోవాల్సి వచ్చింది. హర్యాణా, పంజాబ్ లలో బీజేపీ నాయకులు రైతుల నుండి తప్పించుకోవడానికి అనేక తిప్పలు పడుతున్నారు. అయినా కొన్ని చోట్ల రైతులకు దొరికిపోయి పరుగులు పెట్టాల్సి వస్తున్నది. ఇవ్వాళ్ళ (ఆదివారం) పంజాబ్లో అలాంటి సంఘటనే జరిగింది
.పాటియాలా జిల్లా రాజ్‌పురా పట్టణంలో బీజేపీ జిల్లా సమావేశం ఏర్పాటు చేసింది. ఆ సమావేశానికి పంజాబ్ బిజెపి నాయకుడు భూపేష్ అగర్వాల్ అధ్యక్షత వహించగా స్థానిక బీజేపీ నాయకులు చాలా మంది ఆ సభలో పాల్గొన్నారు. నూతన ధాన్యం మార్కెట్ సమీపంలోని భారత్ వికాస్ పరిషత్ భవనంలో ఈ సమావేశం జరుగుతున్నదని తెలుసుకున్న స్థానిక రైతులు సభ ప్రారంభంలోనే పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని ప్రదర్శనను ప్రారంభించారు.
అంతకంతకూ రైతుల సంఖ్య పెరుగుతుండటంతో బీజేపీ నేతలు అక్కడి నుండి తప్పించుకునా ప్రయత్నాలు మొదలుపెట్టారు. పోలీసుల సహాయంతో అక్కడి నుండి బైటపడటానికి వాళ్ళు చేసిన ప్రయత్నంలో పలువురు తప్పించుకోగలిగారు కానీ మరికొందరు బీజేపీ నాయకులు రైతులకు చిక్కారు. బిజెపి ప్రధాన కార్యదర్శి భూపేష్ అగర్వాల్, బీజేపీ జిల్లా గ్రామీణ యూనిట్ హెడ్ వికాస్ శర్మ మరియు మరికొందరు నాయకులను పక్కనే ఉన్న ఇంటికి తీసుకెళ్లారు పోలీసులు. తీవ్ర భయాందోళనలకు గురైన అగర్వాల్ తనకు, తమ పార్టీ కార్యకర్తల ప్రాణాలకు ప్రమాదం ఉందని ఒక వీడియోను విడుదల చేశారు.
అయితే స్థానిక కౌన్సిలర్ శాంతి స్వరూప్ మాత్రం రైతుల పాల పడ్డాడు. ఆయనను రైతులు పరుగులు పెట్టించారు. ఆయన చుట్టూ పోలీసులున్నప్పటికీ వందల మంది రైతులను చూసి ఆయన పరుగులు పెట్టారు. అయినప్పటికీ వదలని రైతులు ఆయన బట్టలను చించేశారు. ఆయనను రైతులు తరుముతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ఈ సంఘటనపై బీజేపీ తీవ్రంగా స్పంధించింది. అయితే తమపై దాడికి రైతులను కారణంగా చూపకుండా కాంగ్రెస్ పై విరుచుకపడింది. పంజాబ్ లో తమ రాజకీయ కార్యకలాపాలను లేకుండా చేయడానికి ప్రణాళికాబద్ధమైన కుట్ర జరిగిందని బీజేపీ పంజాబ్ ప్రధాన కార్యదర్శి సుభాష్ కుమార్ ఆరోపించారు. దాడి సంఘటన విషయం తెలియగానే ఆ పార్టీ అగ్రనాయకత్వం సుభాష్ కుమార్ ను రాజ్ పురాకు పంపింది. అక్కడికి చేరుకున్న వెంటనే ఆయన మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి పంజాబ్‌లోని మైనారిటీ హిందువులను బెదిరించడానికి కాంగ్రెస్ గూండాలు ప్రయత్నిస్తున్నారు అని మండిపడ్డారు. తమ నాయకులపై దాడికి పోలీసులు కూడా కారణమని ఆయన ఆరోపించారు.
కాగా బీజేపీ ఆరోపణలను డిప్యూటీ పోలీసు సూపరింటెండెంట్ జస్వీందర్ సింగ్ తివానా ఖండించారు. రైతులు అక్కడికి చేరుకున్న వెంటనే తాము చర్యలు తీసుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చామని రైతుల బారి నుండి బీజేపీ నాయకులందరినీ కాపాడామని జస్వీందర్ సింగ్ తివానా అన్నారు. తమ వైపు నుండి ఎటువంటి లోపం జరగలేదని ఆయన స్పష్టం చేశారు. పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారని ఎస్పీ తెలిపారు.
మరో వైపు దాడి సంఘటనపై బీజేపీ పంజాబ్ ప్రధాన కార్యదర్శి సుభాష్ కుమార్ మీడియా సమావేశం ఏర్పాటు చేసిన లయన్స్ క్లబ్ వద్దకు మళ్ళీ వందలాది మంది రైతులు చేరుకొని బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా అక్కడే బైటాయించారు.
Keywords : punjab, farmers, protest, bjp, attack, Protesting Farmers Attack BJP Leaders In Rajpura(2021-07-13 23:15:35)
No comments:
Post a Comment