లెనిన్ ఎవరూ..!?
అవునూ లెనిన్ ఎవరూ...!?అతని గురించి తెలియకనే కదా బీజేపీ నాయకుడు రాజ ʹʹలెనిన్ ఎవరు? ఆయనకు భారత్‌కు సంబంధం ఏమిటి? నేడు లెనిన్ విగ్రహం, రేపు తమిళనాడులొని ఈ.వీ. రామస్వామి (పెరియార్) విగ్రహం!ʹʹ అంటూ ట్విట్టర్‌లో కూసాడు... దానికి ఇతర బీజేపీ నాయకులు వంతపాడుతున్నారు. ..!
నిజమే లెనిన్ గురించి తెలియాలంటే ఈ దేశ స్వాతంత్ర పోరాట చరిత్ర తెలిసుండాలి. అందులో మన పాత్రనై ఉండాలి...అంత సీన్ లేదంటారా కనీసం ఈ దేశం కోసం ప్రాణార్పించిన భగత్‌సింగ్ వంటి యువకిశోరాల జీవిత చరిత్రైన చదివుండాలి...అదీ చేత కాదంటారా మన దేశం కాస్తో కూస్తో ముందడుగు వేయడానికి కారణమయిన పంచవర్ష ప్రణాళికలూ, పారిశ్రామిక అభివృద్ధి ఎలా సాధ్యమైందన్నా తెలిసుండాలి...పోనీ అంతకష్టపడలేమంటారా కనీసం మీరు పొదున్నే లేసి, దండంపెట్టి దండలేసే వీరుడూ- శూరుడూ, స్వాతంత్య్ర పోరాట యోధుడూ అంటూ సావర్కార్‌ను పొగుడుతారే ఆ సావర్కార్ ప్రవాస జీవితం గురించైనా తెలిసుండాలి.. ఇవేవి తెలియకపోతే లెనిన్ గురించి తెలియడం కాస్త కష్టం సామీ...!
ఎందుకంటారా వీళ్ళలో ఎవరి గురించైనా...ఏ చరిత్ర గురించైనా తెలిసున్నా మీకు లెనిన్ తప్పకుండా తెలిసేవాడే. ఈ పార్టీ ఆ పార్టీ అనే తేడా లేకుండా...ఆ నాయకుడు ఈ నాయకుడు అనే వ్యత్యాసం లేకుండా ఆ లెనిన్ నుంచి స్ఫూర్తి పొందినవారే. వీలైతే లండన్‌లోని ఇండియా హౌన్‌లో జరిగిన చర్చల గురించి...బ్రిటిష్ వారికి కోవర్టుగా మారిన మీ సావర్కార్ లెనిన్ గురించి ఎంత గొప్పగా చెబుతాడో..లండన్ నుంచి ఆయన రాసిన ఉత్తరాలను చదివి చూడండి కొంచమైన ఆయన గురించి అర్థమవుతుంది.
అబ్బే చదవడం మా వల్ల ఎక్కడైతుంది అంటారా...? పోనీ మీ పక్కింట్లోనో....ఎదురింట్లోనో ఉన్న హైస్కూల్ పిల్లాడిని పిలిచి అడగండి అరె బాబూ లెనిన్ ఎవరు నాన్న అని. ఆయన గురించి, ఆయనకు భారత్‌కు ఉన్న సంబంధం ఏంటో ఎంత గొప్పగా చెబుతారో..! వినండి. అపుడెపుడో మీలాంటోడే ఒకడు (రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు) ఈ ʹలక్ష్మి సెహగల్ ʹ ఎవరూ, ఆమె గురించి ఎప్పుడూ వినలేదే అన్నాడు..(లక్ష్మి సెహగల్‌ను వామపక్ష పార్తీలు రాష్ట్రపతి అభ్యర్తిగా నిలబెట్టాయి) అందుకే చెప్పేదీ....సరస్వతి శిశుమందిర్‌లో....వేదపాఠశాల్లో...విద్యారణ్య స్కూళ్ళలో చదవకండిరా అని...అలాంటి పనికిమాలిన సూళ్లల్లో చదువబట్టే లెనిన్ గురించి, ఆయనకు మనకు ఉన్న సంబంధం ఏంటో తెలియదు. చివరకు ఈ దేశం కోసం సుభాష్ చంద్రబోష్‌తో కలిసి సాయుధ సమరానికి సై అన్న ʹక్యాప్టన్ క్ష్మీ సెహగల్ ʹ గురించి తెలిసి సావదూ.
బ్రిటీష్ ప్రభుత్వం సృష్టించిన జలియన్ వాలాబాఘ్ మారణాకాండలో(1919)....సైమన్ గోబ్యాక్ పోరాటంలో (1928) లాలాజపతి రాయ్‌ను పొట్టన పెట్టుకున్న సంఘటనలో, తిలక్ అరెస్టు విషయంలో (1908)ఈ దేశ స్వాతంత్య్ర సమరయోధుల పక్షాన నిబడ్డ మహామనిషి లెనిన్. ఆ మారణహోమాన్ని తీవ్రంగా ఖండిరచడమే కాకుండా.బ్రిటీష్ పాలన నుంచి విముక్తి సాధించినప్పుడే భారతీయులకు నిజమైన విముక్తి అనీ, కాంగ్రెస్ పార్టీ 1929 డిసెంబర్ 19న లాహోర్‌లో తీర్మానించడానికి పదేళ్లముందే ʹʹపూర్ణ స్వరాజ్ʹ సాధించండిʹʹ అంటూ అండగా నిలిచిన వ్యక్తి ఈ లెనినే. స్వాతంత్య్ర పోరాటంలో ఏనాడు క్రియాశీలంగా పాల్గోనని మీకూ ఆయన గురించి తెలియమంటే ఎలా తెలుస్తుంది చెప్పూ..
భగత్‌సింగ్ వంటి యువకిశోరాల వర్థంతులనాడు దండులు వేసి దండం పెట్టడమే తప్ప ఏనాడైన ఆయన చరిత్రను చదివుంటే లెనిన్ కొంతలో కొంతైనా అర్థమయ్యేవాడు. పాతికేళ్ళు కూడా నిండని కొంతమంది యువకులు, ఆ లెనిన్ నుండి ఆయన సారధ్యం వహించిన సోవియట్ యూనియన్ నుంచి స్ఫుర్తిని పొందబట్టే ʹహిందూస్తాన్ రిపబ్లిక్ అసోషియేషన్ʹ అని ఉన్న తమ సంఘానికి ʹసోషలిస్టుʹ అన్న పదాన్ని అదనంగా జొడిచి ʹహిందూస్తాన్ సోషలిస్టు రిపబ్లిక్ అసోషియేషన్ (హెచ్‌ఎస్‌ఆర్‌ఏ)గా మర్చారు. ఆ సంఘానికి 1917లో జరిగిన అక్టోబర్ సోషలిస్టు మహావిప్లవ ప్రభావంతో ఒక నిబంధావళిని కూడా రూపొందించి ఉత్తరప్రదేశ్ అంతటా పంచిపెట్టారు. అంత గొప్ప చరిత్ర లెనిన్‌దీ, అదే ఆయన మనకు ఉన్న సంబంధం.. !
సోషలిస్టు విప్లవానికి నాయకత్వం వహించిన లెనిన్ పట్ల, సోషలిజం పట్ల ఆకర్షితు కాబట్టే భగత్ సింగ్, ఆయన సహచరులు 1930 జనవరి 21వ తేది కోర్టులో విచారణ ఎదుర్కొంటూ కూడా లెనిన్ జన్మ దినోత్సవం నాడు మాస్కోకు ఓ తెలిగ్రాం పంపారు. ʹʹలెనిన్ దినోత్సవం నాడు లెనిన్ ఆశయాలను ముందుకు తీసుకుని వెళ్ళేందుకు ఏ కొంచమైనా శ్రమిస్తున్న వారికి మా అభినందనలు. రష్యా చేస్తున్న ఈ ప్రయోగం విజయవంతం కావాలని మేం అకాంక్షిస్తున్నాం. అంతర్జాతీయం కార్మీకొద్యమంలో మేం గళం కలుపుతాంʹʹ అని..!
చిట్ట చివరకు ఉరికంభాన్ని ఎక్కడానికి ఐదు నిముషాల ముందు కూడా ఆ లెనిన్ రచించిన పుస్తకాన్నే భగత్‌సింగ్ చదువుతూ ఉన్నాడంటే ఆ మహానుభావుడు ఈ దేశ యువతకు ఎంత దగ్గరివాడో ఇట్టే తెలిసి పోతుంది. విద్వేశం తప్ప ఏమీ చేతకాని మూర్ఖులు కదా మీరు అందుకే లెనిన్ గురించి, ఆయనకూ మనకున్న గొప్ప సంబంధం ఏమిటో తెలియ విగ్రహాలను కూల్చుతూ పోతారు.
రవీంధ్రనాథ్ ఠాగురూ ఆ లెనిన్ సారధ్యంలోని సోషలిస్టు రష్యాలో ఒక్కసారి అడుగుపెట్టే ఉబ్బితబ్బిబైపోయాడు. ʹʹనా కాళ్లతో నేను చూడక పోతే పది సంవత్సరాలో లక్షలాది ప్రజలను అజ్ఞానాంధకారం నుంచి, అవమానాల నుండి వెలుగులోకి తెచ్చి, వారికి చదవను రాయను నేర్పించమే కాక, వారిలో గౌరవప్రదమైన మానవ జీవితాన్ని నింపగరని నేను నమ్మి ఉండేవాడిని కాదు. అక్కడి విద్యా విధానాన్ని అధ్యయనం చేసేందుకు మనం ఇక్కడికి వచ్చి తీరాలిʹʹ అని రాశాడు. అది ఆ కమ్యూనిస్టు లెనిన్ నాయకత్వంలోని గొప్ప తనం.
అతడు ఈ దేశానికి ఇచ్చిన స్ఫూర్తికి....ఈ దేశం నిదొక్కుకోవడానికి కావసిన శాస్త్ర సాంకేతిక సహాకారం లెనిన్ నాయకత్వంలోని ప్రభుత్వం ఇవ్వబట్టే ఈ దేశం ఈ మాత్రమైన సాంకేతిక రంగంలో ముందుంది లేదంటే మీలాగే ʹʹఆవు- పేడ- మూత్రంʹʹ అంటూ కథలు చెబుతూ బతకాల్సి వచ్చేది.
నిజానికి ఛాందసవాదులైన మీరు ఆ లెనిన్‌ను ఆయనతో మనకున్న సంబంధాన్ని గుర్తించడం లేదు కానీ ఎన్నడో ఈ దేశ మొదటి తరం నాయకులు ప్రభుత్వంలోని పెద్దలు గుర్తించబట్టే ఆయన శతసంవత్సర జన్మదినం సందర్భంగా స్మారకార్థం 35 లక్ష తపా బిల్లల్ని విడుదల చేసి నివాళి అర్పించింది. మరో 30 లక్షల తపా బిల్లల్ని కుడా సోవియట్ యూనియన్ 50 వసంతాలు పూర్తిచేసుకున్న సందర్భంగా విడుదల చేసి రెండు దేశాల మధ్య ఉన్న మిత్రాత్వాన్ని చాటుకున్న చరిత్ర ఈ దేశానిది.
చరిత్రలో ఒక పేజీకూడా లేని మీకు (ద్రోహపు చరిత్ర ఉందనుకోండీ)...చరిత్రలో జరిగిన ఈ విషయాలన్నీ తెలియడం కష్టమే లే.
కానీ ఈ సందర్భంగా లెనిన్ అన్న ఒక మాట గుర్తుచేయానిపిస్తుంది.... రష్యన్ విప్లవం విభృంబిస్తున్న కాలంలో 12 మంది భూస్వాములు చంపబడ్డారని, వారి భవనాలు దగ్ధం చేయబడ్డాయని లెనిన్‌తో చెప్పడానికి ప్రజలు వస్తే, లెనిన్ వారితో ʹʹ12 కాదు, 1200 మంది భూస్వామును, వారి భవనాలను తగుబెట్టుకు రండీ...విప్లవం విఫమైతే అలాంటిది ఏదైనా జరిగినా మనకు మంచిది కదా అన్నాడు...ʹʹ అలాంటిది ఇక్కడ రిపిట్ కాకుండా చూడండి. ఎందుకంటే ఈ దేశంలో భగత్‌సింగ్‌లా లెనిన్ నుంచి స్ఫూర్తి తీసుకున్నయువకులు దాన్ని ఇక్కా ఆచరిస్తే మీకే ప్రమాధం...ఎందుకంటే ఆ పని పెరియార్ తమిళనాడులో ఎప్పుడో చేశాడు కాబట్టి..మళ్ళీ దాన్ని రిపీట్ కాకుండా చూడండి...!!
- ఎస్.ఏ.డేవిడ్
No comments:
Post a Comment