నేటి నుంచి ప్రపంచ వ్యాప్తంగా నక్సల్బరీ 50 వార్షికోత్సవాలు
మే 25 నాటికి నక్సల్బరీ చారిత్రక సాయుధ రైతాంగ పోరాటం యాభై వసంతాలు పూర్తిచేసుకుంటోంది. భారత కమ్యూనిస్టు ఉద్యమం పార్లమెంటు పంథాను తిరస్కరించి సాయుధ పంథాను స్వీకరించిన రోజు. ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమ చరిత్రలో నక్సల్బరీకి ప్రత్యేక స్థానం ఉంది. గడిచిన యాభై ఏళ్లలో దేశ వ్యాప్తంగా విప్లవ పోరాటం విస్తరించింది. మావోయిస్టు పార్టీ నాయకత్వంలో మధ్యభారతంలో ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని నడిపే స్థాయికి నక్సల్బరీ ఉద్యమ పంథా విస్తరించింది. ఈ సందర్బంలో ప్రపంచ వ్యాప్తంగా విప్లవ శ్రేణులు నక్సల్బరీ 50వ వార్షికోత్సవాలు నిర్వహిస్తున్నాయి. మే 20 నుంచి ఈ ఏడాది చివరి వరకూ వేరు వేరు దేశాల్లో నక్సల్బరీ పోరాటానికి, భారతదేశ ప్రజాయుద్ధానికి సంఘీభావంగా సభలు సమావేశాలు నిర్వహించనున్నారు. ఇంటర్నేషనల్ కమిటీ టూ సపోర్ట్ ది పీపుల్స్ వార్ ఇన్ ఇండియా ఆధ్వర్యంలో మే, జూన్, జూలై నెలల్లో వేరు వేరు దేశాల్లో నిర్వహించే కార్యక్రమాలతో పాటు సెప్టెంబర్ 3న ఇటలీలో అంతర్జాతీయ సంఘీభావ సభ నిర్వహిస్తుండడం గమనార్హం.
No comments:
Post a Comment