Tuesday, March 27, 2018

India - mass struggle and people's war - support the spring thunder tour info ICSPWI csgpindia@gmail.com


పోలీసుల దుర్మార్గం - విద్యార్థులు, ప్రొఫెసర్లపై దుర్మార్గమైన దాడి.. ఫోటోలు తీసిన‌ మహిళా జర్నలిస్టుకు లైంగిక వేదింపులు

విద్య ప్రయివేటీకరణ ఆపేయాలంటూ, విద్యార్థినులపై లైంగికవేధింపులకు పాల్పడుతున్న‌ ప్రొఫెసర్‌ అతుల్‌ జోహ్రీని సస్పెండ్‌ చేయాలంటూ
కొద్ది రోజులుగా జేఎన్‌యూ విద్యార్థులు ఆందోళన చేస్తున్నప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. దాంతో వీద్యార్థులు పార్లమెంట్‌ మార్చ్‌కు సిద్ధమయ్యారు. ఈ నిరసనప్రదర్శనలో పాల్గొనాలని జేఎన్‌యూ స్టూడెంట్‌ యూనియన్‌ పలు వర్సిటీల విద్యార్థులను కోరింది. దీంతో అనేక‌ వర్సిటీలకు చెందిన విద్యార్థులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయ విద్యార్థులు,ప్రొఫెసర్లు వర్సిటీ క్యాంపస్‌ నుంచి పార్లమెంటు వరకూ ర్యాలీ చేపట్టారు. మధ్యాహ్నం రెండుగంటలకు ర్యాలీ మొదలైంది. సుమారు రెండువేలకు పైగా విద్యార్థులు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ప్రదర్శన పార్లమెంట్‌ మార్చ్‌కు బయలుదేరటంతో.. పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎక్కడికక్కడ బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. భారీగా వస్తున్న నిరసనకారులను రోప్‌ టీమ్‌లతో అడ్డుకునే ప్రయత్నం చేశారు.
ఈ సందర్భంగా.. 

No comments:

Post a Comment