మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా లో జరిగిన ఎన్ కౌంటర్ బూటకమని వివిధ ప్రజా
సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఎటపల్లి తాలుకా లొని సింలి గ్రామాము లొ పెళ్ళి
భొజనము లో కొవర్టు ద్వార విషం పెట్టి 37 మంది మావొయిస్టు నాయకులను,
కార్యకర్తలను పట్టుకొని తీవ్రమైన చిత్రహింసలకు గురిచెసి కాల్చి చంపారని
తెలంగాణ ప్రజాస్వామిక వేదిక కన్వీనర్ చిక్కుడు ప్రభాకర్ ఆరోపించారు. ఇది
బి.జె.పి.ప్రభుత్వ దుర్మార్గానికి పరాకాష్ట అని మండి పడ్డ ప్రభాకర్
దీనిని దేశవ్యాప్త హక్కులసంఘాలు, ప్రజాసంఘాలు, ప్రజాస్వామిక వాదులు
తీవ్రంగా ఖండించల్సింది గా విఙప్తి చేశారు.
ఈ ఎన్ కౌంటర్ ను తీవ్రంగా
ఖండించిన సీపీఐ ఎంఎల్ న్యూడెమాక్రసీ దీనిపై సుప్రీం కోర్టు న్యాయమూర్తిచే
విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది. చత్తీస్ గడ్, మహారాష్ట్ర
విప్లవోధ్యమంపై కక్షగట్టిన కేంధ్ర రాష్ట్ర ప్రభుత్వాలు నరమేధానికి
ఒడిగట్టాయని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి సాదినేని
వెంకటేశ్వరరావు ఆరోపించారు. సహజ వనరులను కొల్లగొట్టడాన్ని వ్యతిరేకిస్తూ
పోరాడుతున్న ప్రజలపై దుర్మార్గమైన దాడులకు దిగుతున్నారని ఆదివారంనాటి
పోలీసు దాడి అందులో భాగమేనని ఆయన అన్నారు. అది ముమ్మాటికి ఎన్కౌంటర్ కాదని
వారందరినీ సజీవంగా పట్టుకొని కాల్చి చంపారని వెంకటేశ్వరరావు మండిపడ్డారు.
పోలీసులు మావోయిస్టులను చంపి కేరింతలు, డ్యాన్సులు చేయడం వారి దుర్మార్గపు
వైఖరిని తెలియజేస్తోందని ఆయన అన్నారు.37 మంది మావోయిస్టు చనిపోయిన ఈ ఎన్ కౌంటర్ లో ఒక్క పోలీసుకు కూడా చిన్న గాయం కాకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోందని విప్లవ రచయిత వరవరరావు అన్నారు. ఇది ఖచ్చితంగా ద్రోహి ఇచ్చిన సమాచారం ఆధారంగా అందరినీ పట్టుకొని కాల్చి చంపారని ఆయన ఆరోపించారు.
No comments:
Post a Comment