Tuesday, September 25, 2018

Freedom for Varavara Rao and all political prisoners in India - ICSPWI towards international meeting 8/9 december Milan Italyవీవీ ఇంటిని చుట్టుముట్టిన ఏబీవీపీ.. అడ్డుకున్న స్థానికులు

వీవీ
గత కొన్ని రోజులుగా గృహ నిర్బంధంలో ఉన్న విరసం నేత వరవరరావు ఇంటిని ఇవాళ ఆర్ఎస్ఎస్ అనుబంధ విద్యార్థి సంఘ ఏబీవీపీ కార్యాకర్తలు చుట్టుముట్టడానికి ప్రయత్నించారు. అరకు ఎమ్మెల్యే హత్య ఘటనలో వీవీ పాత్ర ఉందంటూ వారు ఆందోళన చేశారు. ఒకానొక సందర్భంలో అపార్టుమెంట్‌లోనికి చొచ్చుకొని పోవడానికి ప్రయత్నించారు. అయితే అపార్టుమెంట్ లోని యువకులు, స్థానికులు వారిని అడ్డుకున్నారు. అసలు గత నెల రోజులుగా ఇంట్లోనే ఉంటున్న ఆయన పాత్ర ఎలా ఉంటుందంటూ ప్రశ్నించడంతో ఏబీవీపీ కార్యకర్తలకు ఏం సమాధానం చెప్పాలో తెలియలేదు.
అసలు భీమా కోరేగావ్ ఘటనతో వీవీకి సంబంధమున్నదని అబద్దపు ప్రచారం మొదలు పెట్టింది కూడా ఆర్ఎస్ఎస్, దాని అనుబంధ సంస్థలేనని ఇప్పుడు ఎక్కడో అరకులో జరిగిన దానికి వరవరరావుకు లింక్ పెట్టి అనవసరమైన రాద్దాంతం చేయడం కేవలం మతోన్మాద ఆర్ఎస్ఎస్ చేస్తున్న కుట్ర అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఏబీవీపీ తమ ప్రచారం కోసమే ఇలాంటి ఎత్తుగడలు పన్నుతోందని.. వీరి వల్ల ఇంట్లో ఉన్న వరవరరావుకు కూడా హాని జరగవచ్చని పలు ప్రజా సంఘాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.
Keywords : varavararao, maoists, abvp, protest, వరవరరావు, మావోయిస్టులు, అరకు ఎమ్మెల్యే, ఏబీవీపీ, ఆందోళన
(2018-09-25 06:58:13)

No comments:

Post a Comment