Tuesday, March 29, 2022

India - Long live Indian revolution! Long Live People's war! Long Live PCI (Maoist)! 23th/29march International week of actions ICSPWI



మొదటి అర్బన్ నక్సలైటు భగత్ సింగ్

మొదటి

23-03-2022

దేశం కోసం 23 ఏళ్ల వయసులోనే ఉరికంబాన్ని ముద్దాడిన భగత్ సింగ్ విద్యార్థులు, యువకులు, రైతులు, కార్మికులను పట్టిపీడిస్తున్న ఈ ప్రభుత్వాన్ని కూల్చండి అని పిలుపునిచ్చారు. అది కూడా నగరంలో ఉండి మరీ పిలుపునిచ్చారు. ఒక్క తెల్లదొరల ప్రభుత్వ కాదు నల్ల దొరలతో నడుస్తున్న వ్వవస్థపై పోరాటానికి ప్రజలందరినీ ఏకం కావాలని పిలపునిచ్చారు. అదేవిధంగా నగరంలోని అర్బన్ నక్సల్స్ కూడా ఆయన అడుగు జాడల్లో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. నేటి అర్బన్ నక్సల్స్ కూడా భగత్ సింగ్ లాగ పెట్టుబడిదారు దోపిడీ, సామ్రాజ్యవాదం, భూస్వాములు దేశానికి శత్రువులని భావించి వాటిని నాశనం చేయాలని ఏకమవుతున్నారు.

కొన్ని రోజుల ముందు అర్బన్ నక్సల్స్ పేరుతో 12నగరాల్లో ఉన్న సామాజిక కార్యకర్తలు, జర్నలిస్టులు, ఉపాధ్యాయులు, ప్రజా కవుల ఇళ్లలోకి పోలీసులు చొరబడి ఇష్టం వచ్చినట్టు ఇంట్లో ప్రతి అంగుళం కూడా వదలకుండా వెతికి ఏమి దొరకకపోగ వారిని అరెస్ట్ చేయడంతో దేశం మొత్తం దిగ్భ్రాంతికి గురైంది. అయితే రైడ్స్ పై ఒకవైపు సోషల్ మీడియా, కొన్ని పత్రికలు అనేక ప్రశ్నలు ప్రభుత్వానికి సందిస్తూ వీటిని ప్రభుత్వపు నియంతృత్వ దోరణి అని ఎండగడుతూ ఉంటే. మరో వైపు పెట్టుబడిదారీ మీడియా అరెస్ట్ చేయబడ్డ వారిని దేశద్రోహం, తీవ్రవాదులు అంటూ తిట్టిపోస్తున్న తీరు మనకు కనిపిస్తుంది.

అయితే ఇలా మీడియాలోనే భిన్నాభిప్రాయాలు భగత్ సింగ్ కాలం లో కూడా ఉన్నవే. అప్పుడు పత్రికలు సమాజంలో మతపరమైన ఆలోచన దోరణి పెంచి ప్రభుత్వపు నియంతృత్వ దోరణి నీ దాచిపెట్టే ప్రయత్నం చేశాయని వ్రాశారు. అప్పటి ఆ లేఖను భగత్ సింగ్ నేటి కార్పొరేట్ మీడియా ఇప్పుడు దేశంలో మొదటి నక్సల్స్ లేఖ అని హెడ్లైన్ పెట్టి మరీ ఎక్స్ క్లూజివ్ అంటూ వార్తను ప్రసారం చేయవచ్చు. అలాగే అమర వీరుడు భగత్ సింగ్ నీ ఈ పోలీసులు, ప్రభుత్వం, వారి అనుకూల మీడియా అర్బన్ నక్సల్ అని ఈ పాటికి ప్రకటించి ఉండవచ్చు.

భగత్ సింగ్ రాసిన ది రెవల్యూషన్ ప్రోగ్రామ్ పేరుతో ఉన్న లేఖను మీ కోసం కింద ఇస్తున్నాం. ఈ లేఖలో ఉన్నటువంటివాటినే పాటిస్తున్న 12మంది ఇళ్లలో రైడ్స్ జరిపి 5గురిని హౌజ్ అరెస్ట్ చేసారు.

భగత్ సింగ్ యువ రాజనీతి కార్యకర్తలకు రాసిన ఉత్తరం...

ప్రస్తుత పరిస్థితిపై మేము కొంత వరకు ఒక అవగాహనకు వచ్చాం. గమ్యం గురించి కొంత చర్చ జరిగింది. మేము సోషలిస్ట్ సమాజం కోరుకుంటున్నాం. అందుకు రాజకీయ విప్లవం ప్రాథమిక అవసరం. ఇదే మనకు అవసరం. రాజకీయ విప్లవం అంటే అర్థం రాజ్యాధికారం. (అంటే విస్తృత స్థాయిలో శక్తి) తెల్ల దొరల చేతిలో నుంచి భారతీయుల చేతిలోకి రావాలి. అది కూడా మన లక్ష్యం వారి లక్ష్యం ఒక్కటిగ ఉన్న వారి చేతిలోకి రావాలి. స్పష్టంగా చెప్పాలంటే రాజ్యాధికారం సామాన్య ప్రజల ప్రయత్నంతో మన విప్లవపార్టీ చేతిలోకి రావాలి.

దీని తర్వాత పూర్తిగా సంతృప్తితో సమాజాన్ని సోషలిస్ట్ దిశలో తీసుకుపోవడానికి అందరు ఒక్క తాటిపైకి రావాల్సిన అవసరం ఉంది. అయితే మీరు విప్లవం అర్థ చేసుకోకపోతే సోషలిస్ట్ దిశలో వెళ్లడం ఇష్టలేకపోతే దయచేసి ఇంక్విలాబ్ జిందాబాద్ నినాదం ఇవ్వడం మానుకోండి. మా దృష్టిలో విప్లవం అనే పదం ఎంతో ఉన్నతమైన ఆలోచనలు కలిగి ఉంది. దీన్ని ఎటువంటి సందేహాలు లేకుండా ఉపయోగించాలి లేకుంటే దుర్వినియోగ చేయబడుతుంది. ఇక మీరు జాతీయ విప్లవం అంటారా దాని అంతిమ లక్ష్యం గణతంత్ర రాజ్యం స్థాపన చేయడం అంటే నాకు ఒక ప్రశ్న తలెత్తుతుంది అయితే మీరు దానికోసం విప్లవానికి సహాయ పడటానికి ఏ శక్తుల మీద ఆధార పడి ఉన్నారు.

జాతీయ విప్లవం అయినా సోషలిస్ట్ అయినా... రైతులు, కార్మికుల శక్తి పై ఆధారపడి ఉంటుంది. కాంగ్రెస్ నేతలకు వీరిని సంగటిత పరిచే ధైర్యం లేదు. జరుగుతున్న ఈ ఆందోళనే చూస్తే మీకు ఈ విషయం అర్థమౌతుంది. వేరే వారి కంటే వాళ్లకు ఈ విషయం పై ఖచ్చితమైన అవగహన ఉంది ఈ శక్తులు లేకుండా ఏం సాధించలేమని. ఎప్పుడైతే వారు సంపూర్ణ స్వాతంత్య్రం కావాలనే ప్రస్తావన తీసుకువచ్చారో అప్పుడు దాని అర్థం విప్లవం. కానీ కాంగ్రెస్ దృష్టిలో ఇది కాదు. దీన్ని యువ కార్యకర్తల ఒత్తిడి వల్ల ప్రాస్తవ్ పస్ చేశారు కానీ. దీని ద్వారా భయబ్రాంతులకు గురి చేసి వారిని తమ గుప్పిట్లో ఉంచుకోవాలని అనుకున్నారు. ఎందుకంటే వాళ్లకు కావలసిన డొమినియన్ హోదా దక్కించుకోవడం.

ఈ విషయంపై మీరు కాంగ్రెస్ జరిపిన వెనకటి సభా సమావేశాలలో తీసుకున్న నిర్ణయాలను ద్వారా దీనిపై ఒక అవగహనకు రావొచ్చు. నేను ముఖ్యంగ చెప్పదలుకున్నది మద్రాసు, కలకత్తా ఇంకా లాహోర్ లలో జరిగిన సమావేశాల గురించి చెబుతున్న. కలకత్తాలో డిమినియన్ స్టేట్ ప్రస్తావ్ పాస్ చేశారు. 12నెలలో దీన్ని ఆమోదించాలని గూడా కూడా చెప్పారు. ఆమోదించని ఎడల కాంగ్రెస్ నిస్సహాయ స్థితిలోకి వెళ్లిపోయి సంపూర్ల స్వాతంత్ర్యమే లక్ష్యంగా ముందుకు వెళుతుంది. పూర్తి సంతృప్తితో 31డిసెంబర్ 1929 అర్ధరాత్రి వరకు ఈ బహుమతి అందుకోవడానికి వేచి ఉండడంతో పూర్తి స్వాతంత్ర్యం దిశగ ప్రస్తావ్ పాస్ చేయడానికి కట్టుబడి ఉన్నారు. అయినా వారు దీన్ని కోరుకోలేదు. అప్పుడు కూడా మాహాత్మ గారు కూడా ఆ మాటలను దాచకుండ ఉంచలేక ఈ విషయాలపై చర్చకు తలుపులు తెరిచే ఉన్నాయని చెప్పారు. వారికి మొదటి నుంచి తెలుసు వీరి ఆందోళన ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక చోట కొన్ని ఒప్పందాల ద్వారా ముంగించవలసి వస్తుందని. కానీ వారి ఈ నిరుత్సాహాన్ని మేము ద్వేషిస్తున్నాం.

విప్లవం ఏ.. ఏ... విషయాలపై ఆధారపడి ఉందని మేము కొన్ని విషయాలపై ఆలోచనలో పడ్డం. కానీ మీరు అనుకున్నట్టు రైతులు కార్మికులు విప్లవం లో భాగం కావడానికి మీరు చెప్పింది వింటారా అనుకఉంటున్నరేమో. కానీ వారికి మీరు భావోద్వేగంతో కూడిన విషయాలు చెప్పి వాళ్ళునున బేవకూఫ్ లను చేయలేరు. వాళ్ళు మిమ్మల్ని సీద అడుగుతారు మీ విప్లవం వల్ల మాకు ఎం లాభమని. మీ విప్లవం లో ఎవరి కోసం ఆత్మ బలిదానాలు కోరుతున్నారని.

భారత ప్రభుత్వంలో ప్రముఖుడిగా సార్ లార్డ్ రీడింగ్ ప్లస్ లో సార్ పురుషోత్తం దాస్ ఠాకూర్ ఉంటే ప్రజలకు పాలనలో తేడా ఏముంది. ఒక రైతుకు ఇందువల్ల ఏమైనా లాభం ఉందా..? ఇంకా చెప్పాలంటే లార్డ్ ఇర్విన్ స్థానం లో తేజ్ బహదూర్ సప్రు వచ్చిన..ఎటువంటి లాభం లేదు.

జాతీయ భావనలను ప్రచారం చేయడం పూర్తిగా పనికిరాని మాట. వాటిని మీ పనులకోసం వాడుకొలేరు. చాలా నిబద్దతతో పనులు చేసుకోవలసి ఉంటుంది. అలాగే వారికి అర్ధం అయ్యేలా విప్లవం వారి భాగుకొసమని విప్లవం మనదని సర్వ శ్రామికుల పక్షం అని, ప్రతిఒక్కరి కోసం పన్జేస్తుందని తెలియజేయాలి.

మీరు మీ లక్ష్యంపై ఒక స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నప్పుడు. మీ లక్ష్యాన్ని పూర్తిచేయడానికి మీ శక్తిని అర్ధం చేసుకునే ఆలోచనలోనే ఉంటారు. అయితే రెండు వేరువేరు విధాలుగా వెళ్ళవలసిన ఉంటుంది. ముందుగా అందుకు తగ్గట్టుగా తయారీ, రెండు అనుకున్న దాన్ని కార్యరూపం ఇవ్వడం.

ప్రస్తుత విప్లవ ఆందోళన ఎప్పుడైతే ముగుస్తుందో. అప్పుడు అనేకమంది నిజాయతీ పరులైన తీవ్రమైన విప్లవ భావాలున్న కార్యకర్తలను నిరాశ నిస్పృహాలతో ఉండడం చూస్తారు. కానీ మీరు భయపడాల్సిన పని లేదు. మీ భావోద్వేగాలను ఒక వైపు ఉంచండి. వాస్తవ పరిస్థితులకుఅర్ధం చేసుకోవడం నేర్చుకోండి. విప్లవం చాలా కఠినమైన పని. ఇది ఒక్క మనిషి తాకత్ తో ముందుకు వెల్లే పనికాదు.

విప్లవం పై జరుగుతున్న దుష్ప్రచారం ఆపడానికి అందరినీ ఒక్కటీ చేయవలసిన అవసరం ఉంటుంది. విప్లవం కోసం విప్లవ కార్యకర్తలకు అనేక బలిదానాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకా మీకు నేను స్పష్టంగా చెప్పాలంటే మీరు వ్యాపారి అయితే ఒక సుస్థిర కుటుంబం కలిగి ఉన్నట్లైతే మీరు ఈ అగ్గికి దూరంగా ఉండడం మంచిది.

ఒక నేతగా ఉండాలనుకుంటే మీరు పార్టీ లో అవసరం లేదు. సాయంత్ర పూట వచ్చి కొంతసేపు మైకుల ముందు ఉపన్యాసాలు ఇచ్చేవ్వల్లు చాలా మంది ఉన్నారు. ఈ నేతలందరూ మాకు ఏ పనికి అవసరం లేదు. మేము లెనిన్ ఇంకో పేరుతో పిలుచుకునే ప్రొఫేస్నల్ విప్లవకారుడిల పూర్తిగ విప్లవం కోసం పనిచేసే విధంగ అనేక ప్రయోగం చేయాల్సి ఉంటుంది. పూర్తి సమయం ఇచ్చిన కార్యకర్త విప్లవం తప్పా జివీతం లో ఇంకా ఏమి కోరికలు లేని వాళ్ళు ఎంత మంది ఉంటే విజయ ఫలాలు అంతా ఎక్కువ ఉంటాయి.

పార్టీని సరైన మార్గం లో నడిపించాలంటే. కొన్ని విషయాల్లో కార్యకర్తలకు స్పష్టమైన ఆలోచన ప్రత్యక్షంగా అర్ధం చేసుకోవడం అన్ని విధాలుగ యోగ్యత.. త్వరగా నిర్ణయం తీసుకొనే శక్తి ఉండాలి. అలాగే పార్టీలో క్రమశిక్షణ ఉంటుంది. ఇంకా పార్టీ కింది స్థాయిలో ఉండి పని చేయాలని ఏమి లేదు. మీరు చాలా కుల్లం కుల్ల పని చేయవచ్చు. అయితే మీరు స్వేచ్చగా జైలుకు వెలత అనుకోవద్దు.

చాలా మంది కార్యకర్తలకు రహస్యంగా పని చేస్తూ జీవనం గడపాల్సిన సమయం. కానీ వారు పూర్తిగ అదేవిధమైన ఉత్సాహంతో పని చేయవలసి ఉంటుంది. దీనంతటికీ ఎవరు సరిగా నిర్వహిస్తారో వారే నేతగా ఎదుగుతారు.

పార్టీకి అవసరమైన కార్యకర్తలను ఆందోళనలో పాలుపంచుకున్న యువకుల ద్వారా భర్తీ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకోసం యువకులకు ఆందోళన మొదటి మెట్టు లాంటిది. అక్కడి నుంచి మన ఆందోళన మొదలవుతుంది. యువకులు అధ్యయన కేంద్రాలు తెరవాలి, పత్రికలు, మాగజైన్ లు ముద్రించాలి. క్లాస్ ల ద్వారా పాఠాలు చెప్పాలి. రాజకీయ కార్యకర్తలను భర్తీ చేయడానికి వారికి ట్రైనింగ్ ఇవ్వడానికి ఇదో మంచి అవకాశం. పార్టీ కార్యకర్తలు నవయువకులకు ఆందోళనలో దిశ నిర్దేశం చేయాలి. పార్టీ ఈ పనిని ప్రచారంతో మొదలుపెడుతుంది. ఘదర్ పార్టీకి 914-1915లో నాశనం అవ్వడానికి ముఖ్య కారణం నిబ్బద్దత లేకపోవడం అంతే కాకుండా రైతులు కార్మికుల మద్దతు కూడా గట్టక పోవడం. పార్టీ పేరు కమ్యూనిస్టు పార్టీ అని ఉండాలి.

క్రమశిక్షణ కలిగిన రాజనీతి కార్యకర్తలను అన్ని ఆందోళనలే నడిపిస్తాయి. ఇక్కడ కార్మిక కర్షకుల కాకుండా అన్ని వర్గాలతో కలవాల్సిన అవసరం ఉంటుంది. ఇంకా లేబర్ యూనియన్ కాంగ్రెసే కాదు అన్ని రాజకీయ సంస్థల ప్రభావంతో ముందుకు వెళ్లే పని పార్టీ చేస్తుంది. పార్టీ ప్రచారాలతో ముందుకు వెళుతుంది ప్రజల్లో చైతన్యం తీసుకొస్తుంది. సోషలిస్టు సిద్దాంతముతో ప్రజలను చైతన్య పరచాలి. సమస్యలపై ప్రతి విషయంపై వారికి అవగాహన ఉండాలి. ఇలాంటి వాటిని గురించి అనేక కరపత్రాలు పంచాలి. కానీ అన్ని విషయాలు ఎప్పుడు స్పష్టంగా ఉండాలి. కార్మికుల ఆందోళనలో పాలుపంచుకునే వ్యక్తి రైతుల, కార్మికుల, అర్థిక, రాజనీతి స్వతంత్రత గురించి విచిత్రమైన ఆలోచన ధోరణిలో ఉంటాడు. వీళ్లంతా ప్రలజను ఉత్తేజ పరిచే వాళ్ళుగా ఉంటారు. ఇలాంటి ఆలోచన భిన్నమైంది వీరిని చూస్తే వీరు ఎలాంటివారో ఎదుటి వాళ్లకు అర్థం కాకపోవచ్చు.

ప్రజల ఆర్థిక స్వాతంత్య్రం కోసం రాజకీయ బలం పొందడానికి ప్రయత్నిస్తాం మేము. ఇందులో ఎటువంటి సందేహం లేదు మొదట్లో మనం వారి చిన్నచిన్న అర్థిక డిమాండ్ లు, విశేషమైన అధికారాల కోసం పోరాటం చెయ్యవలసి ఉంటుంది. ఈ పోరాటాలే రాబోయే రోజుల్లో రాజాధ్యికారం పొందడానికి వారిని ఆలోచింపజేస్తుంది. ఇదే కాకుండా సైనిక విభాగం కూడా ఆర్గనైజ్ చేయాల్సి ఉంటుంది. ఇది చాలా అవసరం కూడా. చాలా సార్లు ఉపయోగపడుతుంది. కష్టమైన సమయాల్లో మొదలుపెట్టి మంచి గ్రూపును మీరు తయారు చేయలేరు. ఆ సమయానికి వారు అన్ని విధాలుగా తయారుగా ఉండలేరు. చెప్పాలంటే నేను చెబుతున్న ఈ విషయంపై అంతగా దృష్టి పెట్టవలసిన అవసరం లేదు. కొందరు నా ఆలోచనలను తప్పుగా చిత్రించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి.

నేను టెర్రరిస్ట్ ను కాదు. నేను ఒక విప్లవకారుడినీ. దీర్ఘ కాలిక కార్యక్రమాలకు సంబంధించిన వాటిపై విశిష్టమైన కచ్చితమైన అవగాహన కలిగి ఉన్నాను. అందుకోసమే ఈ విషయాలపై ఆలోచిస్తున్నాను.

ఆయుధాలు కలిగి ఉన్న సహా చరుల లాగ అంటే రాంప్రసాద్ బిస్మిల్లా లాగ నేను చెబుతున్న విషయాల ద్వారా దోషిగా తీర్చిదిద్దుతారు. అయినా సరే ఊరి కంబం వద్ద ఉన్న నేను నా విప్లవం గురించే ఆలోచిస్తాను. నా ఆలోచనలు ఆ విధంగానే ఉంటాయి. మారవు. అదే దృఢత్వం తో ఉంటాను. అంతే జోష్ తో ఉంటాను. బయట ఉన్నదానికంటే మరణం ముందున్న ఎంతో ఉత్సాహంగా ఉంటాను. అందుకే నేను. నా పాఠకులకు ఒకటి చెబుతాను. నేను చెప్పే విషయాలను వారు చాలా శ్రద్ధతో చదవండి. వాళ్ళు పంక్తుల వైపు చూడాల్సిన అవసరం లేదు.

నేను ఒక పూర్తి శక్తితో ఒక మాట చెప్పాలనుకుంటున్నాను విప్లవకారుడు గా మొదట్లో నేను కొన్ని రోజులు విడిచిపెడితే నేను తీవ్రవాది కాదు. నాకు పూర్తి నమ్మకం ఉంది ఇటువంటి వాటితో మనం ఏమి సాడించలేమని హిందూస్తాన్ సమాజ్ వాదీ రిపబ్లిక్ పార్టీ చరిత్రలో అది అందరికీ స్పష్టంగా తెలిసిపోతుంది.

మన అందరి ఆలోచన దేశంలో ఆందోళన కు సైనిక విభాగం స్థానం లో మన పరిచయం ఉండాలి. ఎవరైనా నన్ను తప్పుగా అర్థం చేసుకొని ఉంటే వాళ్ళు మారండి. నేను చెప్పేది ఏంటి అంటే బాంబులు పిస్తోల్లు దేశానికి అవసరం లేవని కాదు. వాటి కంటే మన సైనికుల వల్ల చాలా లాభం. కానీ నా అర్ధం లో ఖచ్చితంగా కేవలం బాంబు వేయడం అనేది నష్టం కలిగించేదే కాదు. నాశనం చేసేది. పార్టీ సైనిక విభాగానికి ఏ క్షణమైన రెడీగ ఉండాల్సిన అవసరం ఉంటుంది. కష్టాల్లో పనికి వస్తారు. వీరు పార్టీకి రాజకీయ పనిలో సహకులుగా ఉండాలి. ఇక్కడ మీరు మీ స్వతంత్రంగా పని చేయకండి. పైన చెప్పిన విధంగా పార్టీ పనిని ముందుకు తీసుకెళ్లండి. అప్పుడప్పుడు మీటింగ్ లు పెట్టీ సమ్మేళనాలు నిర్వహించి మన కార్యకర్తలకు అన్ని విషయాలపై అవగాహన కల్పించాలి. వారికి సూచనలు చేయాలి. మీరు ఇలా పనులు చేస్తున్నాప్పుడు మీరు చాలా నిమగ్నమై చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా చేయడానికి ఒక 20సంవత్సరాలు పట్టవచ్చు. విప్లవాలు మొదట్లో పది ఏళ్లలో పూర్తి అవుతుందనే కలళను ఒకటి తర్వాత ఒకటి చెప్పండి. ఎలా అంటే గాంధీ చెప్పినట్టు ఆ తర్వాత ఒక్క యాడదిలో స్వరాజ్యం అనే కలను పక్కన పెట్టినట్టు. ఇందుకోసం దిగ్ర్బాంతికి గురి అవ్వాల్సిన పనిలేదు. నిరంతరం కష్టపడటం, ఆత్మబలిదానం ఇవ్వడం, పోరాటం చేయడం తో జీవనం కొనసాగించడం అవసరం. ముందుగా నీ వ్యక్తి వాదం పూర్తిగా అంతం చేసుకోండి. వ్యక్తిగత సుఖం కళలను వదులుకొని పని చేయడానికి ముందుకు రా.....మనకు ధైర్యం, దృఢత్వం, గట్టి కోరిక అవసరం. ఎంత పెద్ద కష్టన్నైనా నీ ధైర్యాన్ని వదులుకోవద్దు. ఎటువంటి అపజయం వచ్చిన నీ గుండె దైర్యాన్ని పోగొట్టుకోకు. ఎన్ని కష్టాలు వచ్చిన నీ విప్లవ జోష్ ను చల్లబడనివ్వకూ. కష్టపడటం, సిద్ధాంతాలను నమ్ముకోవడం ఇంకా ఆత్మబలిదానం ఇవ్వడం తోనే విజయం సాధించ గలవు. ఈ విజయం విప్లవానికి అమూల్యమైన సంపత్తి అవుతుంది.

ఇంక్విలాబ్ జిందాబాద్.

- ప్రేమా నేగీ
janjwar.com సౌజన్యంతో
2018 లో పోస్ట్ చేయబడినది

 

No comments:

Post a Comment